Home> బిజినెస్
Advertisement

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో భారీగా క్యాష్‌బ్యాక్‌.. పొందండి ఇలా!

WhatsApp Cashback: వాట్సాప్‌ యూజర్లకు శుభవార్త. వాట్సాప్‌ పేమెంట్స్‌ ద్వారా చెల్లింపులు చేస్తే.. అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్ ను సొంతం చేసుకోవచ్చు. 
 

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో భారీగా క్యాష్‌బ్యాక్‌.. పొందండి ఇలా!

WhatsApp Cashback Offer: వాట్సాప్‌ పేమెంట్స్‌ ద్వారా లావాదేవీలు జరిపే వినియోగదారులకు అద్భుతమైన క్యాష్‌బ్యాక్ (WhatsApp Cashback) ఆఫర్లను ప్రకటిస్తుంది వాట్సాప్. ఇండియాలో అత్యధిక యూపీఐ లావాదేవీలు కలిగి ఉన్న గూగుల్ పే, ఫోన్ పేలతో పోటీపడేందుకు వాట్సాప్ సరికొత్త మార్గాలను ఆన్వేషిస్తుంది. ఇందులో భాగంగానే భారీగా ఆఫర్లను ప్రకటిస్తూ..యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వాట్సాప్‌ (WhatsApp) వినియోగదారుల కోసం దాని చెల్లింపుల పరిమితిని 100 మిలియన్లకు పెంచింది. ఇది సానుకూల అంశం. ఇది ఇప్పటికే భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. 

రూ.33 వరకు క్యాష్‌బ్యాక్‌.. 
రాయిటర్స్​ సంస్థ నివేదిక ప్రకారం, వాట్సాప్ ద్వారా లావాదేవీలు జరిపే వినియోగదారులకు రూ. 33 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. WhatsApp Payని ఉపయోగించి, వినియోగదారులు చాట్ విండో నుండి నేరుగా వారి కాంటాక్ట్స్ కు డబ్బు పంపవచ్చు. వాట్సాప్ నుండి ఈ క్యాష్‌బ్యాక్ పొందడానికి వినియోగదారులు ఎంత డబ్బు పంపాలి అనే దానిపై కనీస పరిమితి ఏమీ లేదు. ఈ ఆఫర్​ 3 లావాదేవీలకు మాత్రమే. వినియోగదారులు వాట్సాప్ పే ద్వారా ఇతర వినియోగదారులకు రూ. 1 కంటే తక్కువ పంపినప్పటికీ, వారు కూడా క్యాష్​బ్యాక్​కు అర్హులే. 

వాట్సాప్ ద్వారా ఎక్కువగా ఆన్‌లైన్ చెల్లింపుల జరిగేలా చూడటానికి కంపెనీ ఈ ఆఫర్లను ప్రకటిస్తుంది. వాట్సాప్‌లో చెల్లింపుల అవకాశాలను అన్‌లాక్ చేయడానికి క్యాష్‌బ్యాక్ ప్రచారాన్ని దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ఓ వార్త సంస్థతో తెలిపింది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇంతకముందు కూడా ఇలాంటి క్యాష్ బాక్ ఆఫర్లను వాట్సాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Also Read: MTNL 25 Recharge Plan: రూ.25 రీఛార్జ్ తో 365 రోజులు వ్యాలిడిటీ అందిస్తున్న ప్రముఖ టెలికాం సంస్థ! 

Also Read: KGF Srinidhi Shetty: ప్రశాంత్ నీల్ వల్ల నా జీవితమే మారిపోయింది... కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కామెంట్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More