Home> బిజినెస్
Advertisement

WhatsApp Update: వాట్సాప్‌ యాప్‌లో కీలక మార్పు.. ఇకపై మీరు ఆ పని చేయలేరు

WhatsApp Profile Photo Block: ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా.. ప్రజల సమాచారం గోప్యతకు వాట్సప్‌ పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే వ్యక్తిగత గోప్యతకు వాట్సప్‌ తగిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా డిస్‌ప్లే పిక్చర్‌ విషయంలో కీలక మార్పు జరుగనుందని సమాచారం.

WhatsApp Update: వాట్సాప్‌ యాప్‌లో కీలక మార్పు.. ఇకపై మీరు ఆ పని చేయలేరు

WhatsApp Block ScreenShot: వినియోగదారుల వ్యక్తిగత గోప్యత విషయంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ మరో కీలక మార్పు చేయడానికి సిద్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్‌ కాల్‌ బ్లాకింగ్‌, చాట్‌లాక్‌ వంటి ఫీచర్లు ఇప్పటికే తీసుకొచ్చిన వాట్సప్‌ త్వరలోనే డిస్‌ప్లే పిక్చర్‌ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. స్క్రీన్‌ షాట్‌ బ్లాక్‌ సదుపాయాన్ని త్వరలోనే తీసుకురాబోతున్నదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం స్క్రీన్‌ షాట్‌ బ్లాక్‌ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సప్‌కు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే 'వాబీటా ఇన్ఫో' ఈ విషయాన్ని వెల్లడించింది.

Also Read: Aadhaar Update: గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ అప్డేట్‌ కోసం ప్రత్యేక కేంద్రాలు.. ఎక్కడ అంటే..?

వ్యక్తిగత గోప్యతకు వాట్సప్‌ పటిష్ట చర్యలు చేపడుతోంది. ప్రైవసీ ఫీచర్‌లో రోజురోజుకు మార్పులు చేస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా నచ్చినవాళ్లకు మాత్రమే ప్రొఫైల్‌ ఫొటో కనిపించేలా సెట్టింగ్‌లు మార్చుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రొఫైల్‌ ఫొటోను స్క్రీన్‌ షాట్‌ కూడా తీసుకునే సదుపాయం ఉంది. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రొఫైల్‌ ఫొటోలు తీసుకుని డీప్‌ ఫేక్‌లకు పాల్పడుతూ వేధింపులు చేస్తున్నారు.

Also Read: Check Bounce: అసలు చెక్‌ బౌన్స్‌ అంటే ఏమిటి? బండ్ల గణేశ్‌ మాదిరి కావొద్దంటే ఇవి తెలుసుకోండి

ప్రొఫైల్‌ ఫొటోల స్క్రీన్‌ షాట్ తీసుకుని ఆ ఫొటోలతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండడంతో ముఖ్యంగా అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. ఇలాంటి వాటికి చరమగీతం పలికేలా వాట్సప్‌ కొత్తగా అప్‌డేట్‌ తీసుకురాబోతున్నది. ప్రొఫైల్‌ ఫొటో స్క్రీన్‌షాట్‌ తీయడానికి వీలు లేకుండా వాట్సప్‌ చర్యలు చేపట్టనుందని 'వాబిటా ఇన్ఫో' వెల్లడించింది. ఎవి ప్రొఫైల్‌ ఫొటో కూడా ఇకపై స్క్రీన్‌ షాట్‌ తీసుకోకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నది.

వాట్సప్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ సదుపాయం మొదటి నుంచి కల్పిస్తోంది. ప్రొఫైల్‌ ఫొటోను గతంలో డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కూడా ఉండేది. అయితే ఆ ఫొటోలు డోన్‌లోడ్‌ చేసుకుని వేధింపులకు పాల్పడుతుండడంతో వాట్సప్‌ నివారణ చర్యలు చేపట్టింది. ప్రొఫైల్‌ ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని 2019లో రద్దు చేసింది. ఇప్పుడు ప్రొఫైల్‌ ఫొటోలను స్క్రీన్‌ షాట్‌ తీసే అవకాశాన్ని కూడా తొలగించనుంది. ఇప్పటికే ఇలాంటి సదుపాయం ఫేసుబుక్‌లో అమల్లోకి వచ్చింది. త్వరలోనే వాట్సప్‌లో ఈ మార్పు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా మరోసారి వాట్సప్‌ వినియోగదారుల వ్యక్తిగత వివరాలకు గోప్యత ప్రధాన బాధ్యత అని చాటిచెప్పింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More