Home> బిజినెస్
Advertisement

Vivo V23 Pro: అతి త్వరలోనే మార్కెట్‌లోకి వివో V23 ప్రో.. ఫీచర్స్ అదిరిపోలా! ధర ఎంతంటే?

Vivo V23 Pro స్మార్ట్‌ఫోన్‌ 2022 జనవరి 4న భారత మార్కెట్‌లో విడుదలవుతుందని సమాచారం. జనవరి 4న కాకుంటే.. అదే నెల మొదటి వారంలో అయినా మార్కెట్‌లోకి రానుందని తెలుస్తోంది. 
 

Vivo V23 Pro: అతి త్వరలోనే మార్కెట్‌లోకి వివో V23 ప్రో.. ఫీచర్స్ అదిరిపోలా! ధర ఎంతంటే?

Vivo V23 Pro Launched Early January in India: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా కంపెనీల హవా కొనసాగుతోంది. రెడ్ మీ, రియల్ మీ, ఒప్పో, వివో లాంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు భారత మార్కెట్‌ను ఏలుతున్నాయి. ఒకదానితో మరొకటి పోటీపడి మరీ కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి తెస్తున్నాయి. తాజాగా Vivo V23 Proను విడుదల చేసేందుకు ప్రముఖ మొబైల్ సంస్థ 'వివో' సిద్ధమైంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ కొత్త మొబైల్‌ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన Vivo V21 సక్సెస్ అయిన విషయం తెలిసిందే. Vivo V21 కంటే అడ్వాన్స్ టెక్నాలజీతో Vivo V23 రానుంది. 

Vivo V23 Pro స్మార్ట్‌ఫోన్‌ 2022 జనవరి 4న భారత మార్కెట్‌లో విడుదలవుతుందని సమాచారం. జనవరి 4న కాకుంటే.. అదే నెల మొదటి వారంలో అయినా మార్కెట్‌లోకి రానుందని తెలుస్తోంది. Vivo V23 బేస్ మొబైల్ ఈ నెలాఖరులో భారతదేశంలో విడుదల అవుతుందని ఇప్పటికే ప్రకటించగా.. ఇప్పుడు ఆలస్యం కానుందని సమాచారం. Vivo V23 Pro విడుదల అనంతరమే బేస్ మొబైల్ మోడల్ అందుబాటులోకి వస్తుందట. 

Also Read: Rana Daggubati Birthday: 'భీమ్లా నాయక్' నుంచి రానా దగ్గుబాటి బర్త్ డే సర్ ప్రైజ్!

Vivo V23 Pro, Vivo V23 Base హ్యాండ్‌సెట్‌ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించి అధికారిక సమాచారం ఇప్పటివరకు లేదు. అయినప్పటికీ Vivo V23 హ్యాండ్ సెట్ Vivio V21 5Gకి సారూప్యమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అప్‌గ్రేడ్ చిప్‌సెట్ మరియు కెమెరా సామర్థ్యాలలో Vivo V23 బెటర్ వెర్షన్ కలిగి ఉంటుందట. Vivo V21 5G మోడల్ 8GB RAM, MediaTek డైమెన్సిటీ 800U SoCని కలిగి ఉంది. అంతేకాదు 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 44-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. అయితే Vivo V23లో సెల్ఫీ కెమెరా కూడా 64-మెగాపిక్సెల్ ఉండనుందట. 

Also Read: BiggBoss 5 Title Winner: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో సన్నీనే టాప్, అతనికి ఇతరులకు తేడా ఇదే

Vivo V23e 5G నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో అధికారికంగా విడుదల చేయబడింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek డైమెన్సిటీ 810 SoCని కలిగి ఉంది. 8GB రామ్, 128 స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపుగా రూ. 29,000లుగా ఉండనుంది. 6.44 ఇంచెస్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా Vivo V23e 5Gలో ఉన్నాయి. ఇవే ఫీచర్స్ Vivo V23లో ఉండనున్నాయని తెలుస్తోంది. ధర కూడా దాదాపుగా ఇంతే ఉండనుంది. అధికారిక ప్రకటన వచ్చాకే ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలియరానుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More