Home> బిజినెస్
Advertisement

Discount on iPhone 14 : ఐఫోన్ 14 పై రూ. 37 వేల వరకు డిస్కౌంట్.. యాపిల్ వాచ్ ఫ్రీ ఆఫర్

ఐఫోన్ 14 తో పాటు ఇతర యాపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ లభించడం అనేది విజయ్ సేల్స్ ఆఫర్స్‌లో ఒకటని చెప్పుకోవచ్చు. ఐఫోన్ 14 ఫోన్ 128GB వేరియంట్ ఫోన్ అసలు ధర రూ. 79,900, కాగా విజయ్ సేల్స్ లో ఈ ఫోన్ పై రూ. 37 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

Discount on iPhone 14 : ఐఫోన్ 14 పై రూ. 37 వేల వరకు డిస్కౌంట్.. యాపిల్ వాచ్ ఫ్రీ ఆఫర్

Discount on iPhone 14 : న్యూఢిల్లీ: ఇండియాలో పేరున్న రిటైల్ స్టోర్స్ లో విజయ్ సేల్స్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విక్రయాల్లో బిజినెస్ చేస్తోన్న ఈ రిటైల్ స్టోర్ తాజాగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపిక చేసిన ఉత్పత్తులపై 50% వరకు డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. అలాగే క్యాష్‌బ్యాక్ ఆఫర్స్, నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ఇక్కడికి వచ్చే అన్ని వయస్సుల వారికి ఏదో ఒక ఆఫర్ రెడీగా ఉంది అని విజయ్ సేల్స్ ప్రకటించింది. ఆగస్ట్ 10వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది అని విజయ్ సేల్స్ తమ ప్రకటనలో పేర్కొంది.

విజయ్ సేల్స్ ఫ్రీడమ్ సేల్ : 
ఐఫోన్ 14 తో పాటు ఇతర యాపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ లభించడం అనేది విజయ్ సేల్స్ ఆఫర్స్‌లో ఒకటని చెప్పుకోవచ్చు. ఐఫోన్ 14 ఫోన్ 128GB వేరియంట్ ఫోన్ అసలు ధర రూ. 79,900, కాగా విజయ్ సేల్స్ లో ప్రారంభ ధర రూ. 69,900 గా ఉంది. అదనంగా, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కార్డులు ఉపయోగించి ఈ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్స్ కి రూ. 4000 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ కూడా ఉంది. కస్టమర్స్ తమ వద్ద స్మార్ట్‌ఫోన్ ని విజయ్ సేల్స్ స్టోర్‌లో రూ. 15,000 లేదా అంతకంటే ఎక్కువ ధరకు ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్టయితే, వారికి అదనంగా రూ. 8,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే అన్నీ కలిపి మొత్తం రూ. 37,000 వరకు డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఈ డిస్కౌంట్స్ అన్నీ తీసేస్తే.. ఐఫోన్ 14, 128GB కేవలం రూ. 42,900 లభిస్తుంది అని విజయ్ సేల్స్ వెల్లడించింది.

అన్ని విజయ్ సేల్స్ స్టోర్లలో నథింగ్ ఫోన్ (2) :
స్మార్ట్‌ఫోన్ డీల్స్‌లో భాగంగా, నథింగ్ ఫోన్ (2) కి ఉన్న క్రేజుని దృష్టిలో పెట్టుకుని విజయ్ సేల్స్ వాళ్లు కూడా దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ ని అమ్మకానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.

హోమ్ అప్లయెన్సెస్‌పై భారీ డీల్స్ :
హోమ్ అప్లయెన్సెస్‌పై విజయ్ సేల్స్ భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇక్కడ వాషింగ్ మెషిన్స్ రూ. 8,990 నుండే లభిస్తున్నాయి. పైగా డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంది. వాక్యూమ్ క్లీనర్స్ ని 60% తగ్గింపు ఆఫర్లతో రూ. 1,899 కే లభిస్తున్నాయి. డిష్‌వాషర్స్ సైతం 60% వరకు తగ్గింపు అనంతరం రూ. 20,990 కే లభిస్తున్నాయి. వాటర్ గీజర్లు రూ.499 లకే అమ్మకానికి అందుబాటులో ఉండటం అనేది రియల్లీ టెంప్టింగ్ ఆఫర్ అనే అనుకోవచ్చు.

స్మార్ట్ టీవీలపై స్మార్ట్ ఆఫర్స్ :
విజయ్ సేల్స్ రిటైల్ స్టోర్లలో ఆఫర్లపై కేవలం రూ. 16,990 లకే స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయొచ్చు. అలాగే రూ. 1,699 నుండే సౌండ్‌బార్స్, హోమ్ థియేటర్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. పార్టీ స్పీకర్స్ సైతం రూ. 7,399 నుండి లభిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు

యాపిల్ వాచీలు, మూవీ టికెట్స్ ఆఫర్స్ :
ఈ భారీ డిస్కౌంట్స్ మాత్రమే కాకుండా ఈ మెగా ఫ్రీడమ్ సేల్‌లో పాల్గొనే వారికి పేటీఎంతో కలిసి విజయ్ సేల్స్ ఒక కాంటెస్ట్ కూడా నిర్వహిస్తోంది. ఈ కాంటెస్టులో గెలిచిన వారికి యాపిల్ వాచీలు, సినిమా టిక్కెట్‌లను బహుమతులుగా అందిస్తోంది. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు విజయ్ సేల్స్ స్టోర్‌లో పేటీఎం ద్వారా EMI పద్ధతిలో ఏవైనా ఎలక్ట్రానిక్స్ షాపింగ్ చేయాల్సి ఉంటుంది. 30 మందికి మాత్రమే యాపిల్ వాచ్‌ వరించే అవకాశం ఉండగా.. మిగతా వారికి కచ్చితంగా సినిమా టిక్కెట్ వోచర్స్ గెలుచుకునే అవకాశం ఉంది అని విజయ్ సేల్స్ ప్రకటించింది. ఇదేదో బాగుంది కదూ..

ఇది కూడా చదవండి : Tata Neu Sale Parade 2023: టాటా న్యూ సేల్ పరేడ్ 2023.. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్స్, ఏసీలు

ఇది కూడా చదవండి : Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 7 వేలకే టీవీ, 16 వేలకే ల్యాప్‌టాప్స్, 58 వేల నుండే బైక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More