Home> బిజినెస్
Advertisement

UPI Payment Surcharges: ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్నారా, మీ జేబుకు చిల్లు పడుతుంది జాగ్రత్త

UPI Payment Surcharges: మీరు అదే పనిగా ఫోన్‌పే, గూగుల్ పే వాడేస్తున్నారా..ఇక నుంచి జాగ్రత్త. ఫోన్‌పే, గూగుల్ పే,పేటీఎంలకు దూరంగా ఉండకపోతే మీ జేబుకు చిల్లు పడుతుంది. యూపీఐ చెల్లింపులపై ఇక  అదనపు ఛార్జ్ వసూలు చేయనున్నారు.

UPI Payment Surcharges: ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్నారా, మీ జేబుకు చిల్లు పడుతుంది జాగ్రత్త

UPI Payment Surcharges: తరచూ ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే, అమెజాన్ పే వంటి యూపీఐ చెల్లింపులపై ఆధారపడేవారికి ఇది ఒక అలర్ట్. అదే పనిగా వీటిని ఉపయోగిస్తే ఇక షాక్ తగలనుంది. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ లావాదేవీలు ప్రియం కానున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరపున యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్‌కు సంబంధించిన సర్క్యులర్ ఒకటి విడుదలైంది. దీని ప్రకారం ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ద్వారా చెల్లించే మర్చంట్ లావాదేవీలపై ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్టుమెంట్స్ ఛార్జ్ అంటే పీపీఐ రుసుము వసూలు చేయాలనే ప్రతిపాదన ఉంది. దీని ప్రభావం కోట్లాదిమందిపై పడనుంది.  మీరు కూడా అదే పనిగా యూపీఐ చెల్లింపులు చేస్తుంటే నియంత్రించుకోకతప్పదేమో. లేకపోతే మీ జేబుకు చిల్లు పడవచ్చు. ఎందుకంటే ఎన్‌పీసీఐ జారీ చేసిన ఓ సర్క్యులర్ ఆందోళన కల్గిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ లావాదేవీలతో జరిగే మర్చంట్ చెల్లింపులపై పీపీఐ ఛార్జ్ పడనుంది. 

1.1 శాతం సర్‌ఛార్జ్ వసూలు చేసే సూచన

ఎన్‌పీసీఐ తరపున జారీ అయిన సర్క్యులర్‌లో ఏప్రిల్ 1 నుంచి 2 వేల రూపాయాలు దాటిన లావాదేవీలపై 1.1 శాతం సర్‌చార్జ్ వసూలు చేసేందుకు ప్రతిపాదన ఉంది. ఈ రుసుమును మర్చంట్ లావాదేవీలు అంటే వ్యాపారులకు చెల్లింపు చేసే కస్టమర్లు ఇవ్వాల్సి ఉంటుంది. పీపీఐలో వాలెట్ లేదా కార్డ్ ద్వారా జరిపే లావాదేవీలు ఉంటాయి. సాధారణంగా ఇంటర్‌ఛేంజ్ ఫీజు కార్డు కార్డు పేమెంట్స్‌కు సంబంధించి ఉంటుంది. 

డిజిటల్ మోడ్ సహాయంతో పేమెంట్

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సెప్టెంబర్ 30, 2023 లేదా అంతకంటే ముందే దీనిపై సమీక్ష ఉంటుంది. ఎన్‌పీసీఐ సర్క్యులర్ ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి డిజిటల్ మోడ్ చెల్లింపులు భారం కానున్నాయి. ఒకవేళ 2000 కంటే ఎక్కువ చెల్లింపులు ఉంటే..రుసుము వసూలు చేయాల్సి ఉంటుంది. 70 శాతం యూపీఐ లావాదేవీలు సాధారణంగా 2000 రూపాయలకంటే ఎక్కువే ఉంటున్నాయి. ఎన్‌పీసీఐ సర్క్యులర్  ప్రకారం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని తెలుస్తోంది. 

యూపీఐ లావాదేవీలపై ప్రభావం ఉంటుందా

అయితే ఈ కొత్త నిబంధనలు వ్యక్తిగత యూపీఐ చెల్లింపులపై ప్రభావం చూపించదు. పీపీఐ ఇన్‌స్ట్రుమెంట్స్ అయిన మొబైల్ వ్యాలెట్స్ ద్వారా వ్యాపారులకు 2 వేల కంటే ఎక్కువ చెల్లిస్తేనే ఈ అదనపు ఛార్జ్ వర్తిస్తుంది. వ్యక్తిగత యూపీఐ చెల్లింపులపై యూపీఐ అదనపు ఛార్జీలు వర్తించవు. 

ఆర్బీఐ ఆమోదిస్తేనే

అయితే ఎన్‌పీసీఐ ఈ కొత్త ప్రతిపాదనల్ని ఆర్బీఐకు సమర్పించింది. ఆర్బీఐ ఈ ప్రతిపాదనల్ని ఆమోదిస్తేనే ఈ సర్ చార్జీలు అమల్లోకి వస్తాయి. ఆర్బీఐ ఆమోదిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఒకవేళ ఆర్బీఐ ఈ ప్రతిపాదనల్ని ఆమోదిస్తే పీపీఐ ప్రొవైడర్లు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడనుంది. 

Also read: New Changes in PPF: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనల్లో కీలక మార్పులు, ఏప్రిల్ నుంచి కొత్త నియమాలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More