Home> బిజినెస్
Advertisement

Budget 2024: బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను మినహాయింపు 8 లక్షలకు పెరిగేనా

Budget 2024: మరి కొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ ఉంది. చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల బడ్జెట్ కావడంతో అందరికీ అంచనాలు ఎక్కువే ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Budget 2024: బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను మినహాయింపు 8 లక్షలకు పెరిగేనా

Budget 2024: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరి కొద్దిరోజుల్లో అంటే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల సమయం కావడంతో మద్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో ఈసారి బడ్జెట్‌పై భారీ ఆశలే పెట్టుకున్నారు. 

కేంద్ర బడ్జెట్‌లో ఈసారి ఆదాయపు పన్ను మినహాయింపు, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు, దీర్ఘకాలిక పన్ను విధానం, వినియోగం, పొదుపు ప్రోత్సహించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆధాయవర్గాల ప్రజలు ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆదాయ పరిమితిని 7 లక్షల నుంచి 8 లక్షలు చేయవచ్చని తెలుస్తోంది. సెక్షన్ 87ఏ కింద వ్యక్తిగత ట్యాక్స్ పేయర్లకు కొంత ఉపశమనం ఉండవచ్చని అంచనా. ఇక ఎక్కువ పన్ను విధిస్తున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొద్దిగా ఉపశమనం కల్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అదే ఆశిస్తోంది. 

వ్యక్తిగత ఆదాయపు పన్నుకై కొన్ని మినహాయింపులు చేర్చి..సింగిల్ హైబ్రిడ్ పధకం ప్రవేశపెట్టవచ్చని ఇంకొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. మహిళా పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించడంలో భాగంగా పన్ను మినహాయింపు, ప్రసూతి సెలవులు అందించాలనేది ఎఫ్ఐసీసీఐ విమెన్స్ విభాగం కోరుతోంది. ఎంఎస్ఎంఈలు దేశ జీడీపీ, ఉపాధి కల్పను పట్టుగొమ్మలని, ఇలాంటి వాటిని ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా ప్రోత్సహించాల్సిన అవసరముందని అంటున్నారు. 

Also read: February 2024 Bank Holidays: ఫిబ్రవరిలో 11 రోజులు మూతపడనున్న బ్యాంకులు, సెలవులివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More