Home> బిజినెస్
Advertisement

Tata vs Maruti SUV: నెక్సానే కాదు ఆ టాటా మోటార్స్ కారు కూడా మారుతి బ్రెజాను దాటేసిందిగా

Tata vs Maruti SUV: ఇటీవలి కాలంలో ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. దేశంలో ఎస్‌యూవీ కార్లలో ప్రముఖంగా చెప్పుకోవల్సింది టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, హ్యుండయ్ క్రెటా. ఎస్‌యూవీ అమ్మకాల్లో మూడూ పోటీపడుతుంటాయి.
 

Tata vs Maruti SUV: నెక్సానే కాదు ఆ టాటా మోటార్స్ కారు కూడా మారుతి బ్రెజాను దాటేసిందిగా

Tata vs Maruti SUV: ఎస్‌యూవీ మార్కెట్‌లో టాటా నెక్సాన్ వర్సెస్ మారుతి బ్రెజా పోటీ పోటీ నడుస్తుంటాయి. ఓక్కోసారి టాటా నెక్సాన్ అయితే మరోసారి మారుతి బ్రెజా ముందంటుంది. ఇప్పుడు టాటాకు చెందిన మరో ఎస్‌యూవీ టాటా పంచ్ ఈ రెండింటికీ పోటీగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

దేశంలో ఎస్‌యూవీ అమ్మకాల్లో టాటా నెక్సాన్ వర్సెస్ మారుతి బ్రిజా వర్సెస్ హ్యుండయ్ క్రెటా వర్సెస్ టాటా పంచ్‌లు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. నవంబర్ ఎస్‌యూవీ అమ్మకాల్లో టాటా మోటార్స్‌కు చెందిన రెండు కార్లు మారుతి బ్రెజాను దాటి అమ్మకాలు నమోదు చేశాయి. ఒకటి టాటా నెక్సాన్ రెండవది టాటా పంచ్. ఈ రెండూ నవంబర్ అమ్మకాల్లో మారుతి బ్రెజాను దాటేశాయి. 

నవంబర్ 2023లో టాప్ 3 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీలను పరిసీలిస్తే టాటా నెక్సాన్ మొదటి స్థానంలో టాటా పంచ్ రెండవ స్థానంలో, మారుతి బ్రెజా మూడవ స్థానంలో నిలిచాయి. నవంబర్ నెలలో టాటా నెక్సాన్ 14,916 యూనిట్లు అమ్మకాలు సాధించగా గత ఏడాది ఇదే సమయంలో 15,871 యూనిట్లు అమ్మకాలు సాగించింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి 6 శాతం విక్రయాలు తగ్గాయి. ఇక రెండో స్థానంలో ఉన్న టాటా పంచ్ నవంబర్ 2023లో 14,383 యూనిట్ల విక్రయాలు నమోదు చేయగా గత ఏడాది ఇదే నెలలో 12,131 యూనిట్లు అమ్మకాలయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 19 శాతం అధికం. అందుకే ఈసారి రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో ఉన్న మారుతి బ్రెజా నవంబర్ 2023లో 13, 393 యూనిట్లు అమ్మకాలు సాగిస్తే గత ఏడాది 11,324 యూనిట్ల అమ్మకాలయ్యాయి. అంటే గత ఏడాది కంటే 18 శాతం అధికం.

టాటా నెక్సాన్ ధర 8.10 లక్షల్నించి 15.50 లక్షల వరకూ ఉంటుంది. టాటా పంచ్ 6 లక్షల్నించి 9.52 లక్షల వరకూ ఉంటుంది. ఇక మారుతి బ్రెజా ధర 8.29 లక్షల నుంచి 14.14 లక్షలుంటుంది. ఇందులో టాటా నెక్సాన్, మారుతి బ్రెజా రెండూ ఒకే విభాగంలోని ఎస్‌యూవీలు. టాటా పంచ్ మాత్రం మైక్రో ఎస్‌యూవీ. టాటా నెక్సాన్, మారుతి బ్రెజా 4 మీటర్ల ఎస్‌యూవీలు కాగా పంచ్ కూడా 4 మీటర్ ఎస్‌యూవీలోకి వస్తుంది. అయితే పరిమాణంలో మాత్రం చిన్నది. 

Also read: Ayodhya Tour: ఆయోధ్యలో రూపుదిద్దుకున్న కొత్త ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, ప్రధాని మోదీచే ఇవాళ ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More