Home> బిజినెస్
Advertisement

Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్​తో 400 కిలో మీటర్ల ప్రయాణం!

Tata Nexon EV: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. దేశీయ మార్కెట్లో విద్యుత్ వాహనాల సెగ్మెంట్​పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే లాంగ్​ రేంజ్ విద్యుత్ వాహనాన్ని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్​తో 400 కిలో మీటర్ల ప్రయాణం!

Tata Nexon EV: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా లాంగ్​ రేంజ్​ ఈవీని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే మార్కెట్లో బెస్ట్​ సెల్లర్​గా ఉన్న నెక్సాన్ ఈవీని మరింత అడ్వాన్స్​డ్​గా మార్పులు చేసిందట. ఇందులో లాంగ్ రేంజ్ వేరియంట్​ను అతి త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోందని తెలిసింది. ఆటోమొబైల్ వర్గాల ప్రకారం ఏప్రిల్​లోనే ఈ వాహనం విడుదలనుంది. ఆ తర్వాత వీలైనంత త్వరగానే విక్రయాలు కూడా ప్రారంభమవ్వచ్చని సమాచారం. అయితే దీనిపై కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కొత్త వెర్షన్​ గురించి..

ఎస్​యూవీ సెగ్మెంటోలో నెక్సాన్ ఈవీ 2020లో విడుదలైంది. ఇప్పుడు దీనికి అప్​డేట్​ వెర్షన్ రానుంది. కొత్త వేరియంట్​లో సరికొత్త ఇంటీరియర్​తో రానుందట. ఈ కొత్త వేరియంట్ ఎక్స్​ 2 ప్లాట్​ఫామ్​పై రావచ్చని ఆటోమొబైల్ వర్గాల సమాచారం.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 400 కిలో మీటర్లు ప్రయాణించేందుకు వీలుగా ఈ కొత్త వేరియంట్​ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. అయితే లాంగ్​ రేంజ్​ కోసం బ్యాటరీ పరిమాణం పెరగటం, ట్రంక్ స్పేస్​ తగ్గటం వంటి మార్పులు ఉండొచ్చని సమాచారం. ఛార్జింగ్ ప్యాక్​లు 3.3 కిలో వాట్స్​తో పాటు.. 6.6 కిలో వాట్స్​ ఆప్షన్​తో కూడా లభించే వీలుందని తెలిసింది. అయితే కంపెనీ నుంచి ఈ కొత్త వెర్షన్ నెక్సాన్​పై త్వరలోనే ప్రకటన వెలువడొచ్చని సమాచారం. అప్పుడే దీనిపై మరింత సమాచారం తెలియనుంది.

Also read: Aadhaar ration linking: ఆధార్​, రేషన్​ లింక్​కు గడువు పెంపు- కొత్త డేట్ ఇదే..

Also read: Stocks today: వారాంతంలో స్టాక్ మార్కెట్లకు నష్టాలు- 57,500 దిగువకు సెన్సెక్స్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More