Home> బిజినెస్
Advertisement

SSY Key Features: మీ పెట్టుబడికి మూడింతలు లాభం, మెచ్యూరిటీతో 70 లక్షలు పొందే అవకాశం

SSY Key Features: ఆడపిల్లల భవిష్యత్ కోసం కేంద్ర ప్రభుత్వ ప్రారంభించిన అద్భుతమైన పధకం సుకన్య సమృద్ది యోజన. చిన్న మొత్తం పొదుపు పధకాల్లో అత్యంత ఆకర్షణీయమైన పధకం. ఈ పధకం పూర్తి ప్రయోజనాలు తెలుసుకుందాం.

SSY Key Features: మీ పెట్టుబడికి మూడింతలు లాభం, మెచ్యూరిటీతో 70 లక్షలు పొందే అవకాశం

SSY Key Features: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్ని ఆకర్షణీయమైన సేవింగ్ పధకాల్లో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. ఈ పధకం ముఖ్యంగా ఇంట్లో ఆడ పిల్లలకు ఉద్దేశించింది. ఆడపిల్లల భవిష్యత్ సంరక్షణకు ఉపయోగపడే అద్బుతమైన పధకం అని చెప్పవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ప్రత్యేకతలేంటి, ఎందుకు ఇందులో ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం.

సుకన్య సమృద్ధి యోజన పధకంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల వడ్డీ రేటు కూడా పెంచింది. 8 నుంచి 8.2 శాతం వడ్డీ పెరిగింది. చిన్న మొత్తం పొదుప పధకాల్లో అత్యధిక వడ్డీ ఇచ్చే పధకం ఇదే. మీరు పెట్టిన పెట్టుబడికి 3 రెట్లు లాభాలను ఇచ్చే పధకం. ఏడాదికి 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ పూర్తయ్యాక ఏకంగా 70 లక్షలు చేతికి అందుతుంది. 

ఈ పధకంలో ఏడాదికి కనీసం 250 రూపాయలు గరిష్టంగా 1.5 లక్షల రూపాయులు పెట్టుబడి పెట్టవచ్చు. మీ ఆర్ధిక పరిస్థితికి అనుగుణంగా ఇన్వెస్ట్ మెంట్ చేసుకునే వీలుంటుంది. ఈ పధకంలో చేసే ఇన్వెస్ట్‌మెంట్‌కు సెక్షన్ 80సి కింద ఏడాదికి 1.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఈ పధకంపై వచ్చే రిటర్న్స్ కూడా ట్యాక్స్ మినహాయింపుతో ఉంటాయి. మెచ్యూరిటీ నగదుపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 

సుకన్య సమృద్ధి యోజన పధకంలో లాకిన్ పీరియడ్ 21 ఏళ్లు అంటే మీ అమ్మాయికి 21 ఏళ్లు నిండాక చేతికి అందుతుంది. మీ అమ్మాయికి 18 ఏళ్లు వచ్చాక అప్పటి వరకూ పొదుపు చేసిన నగదులో 50 శాతం డ్రా చేసుకునే అవకాశముంటుంది. 21 ఏళ్లు నిండాకైతే మొత్తం నగదు చేతికి అందుతుంది. 

ఈ పధకంలో ఎక్కౌంట్ ఓపెన్ చేసినప్పట్నించి 15 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఈ పధకం మిగిలిన పథకాల్లా కాదు. మీ అమ్మాయి భవిష్యత్ సంరక్షణకు ఉపయోగపడే పధకమిది. 

Also read: Ramlalla Idol Colour: అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహం నలుపు రంగులో ఎందుకుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More