Home> బిజినెస్
Advertisement

SBI Recruitment 2022: ఎలాంటి పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగం.. ఖాళీలు, జీతం వివరాలు ఇవిగో..

State Bank Of India Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకోసం ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించడం లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. పూర్తి వివరాలు ఇలా.. 

SBI Recruitment 2022: ఎలాంటి పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగం.. ఖాళీలు, జీతం వివరాలు ఇవిగో..

State Bank Of India Jobs: నిరుద్యోగులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్టు ప్రాతిపదికన కలెక్షన్ ఫెసిలిటేటర్ల పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 1438 ఖాళీలను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. సీపీసీ/ప్రాంతీయ కార్యాలయం/అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్/ఆస్తుల ట్రాకింగ్ సెంటర్ లేదా సంబంధిత ఎల్‌హెచ్ఓ ద్వారా నిర్ణయించిన ఏదైనా ఇతర కార్యాలయలలో ఉన్న సిబ్బందిని నియమించనున్నారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 22న ప్రారంభమైంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి రోజు జనవరి 10, 2023. నిర్దిష్ట విద్యార్హత అవసరం లేదని నోటిఫికేషన్‌లో ఎస్‌బీఐ పేర్కొంది. రిటైర్డ్ సిబ్బందికి తగిన పని అనుభవం, సంబంధిత ప్రాంతంలో మొత్తం వృత్తిపరమైన నైపుణ్యం ఉండాలి.

మొత్తం ఖాళీలు
జనరల్: 680
ఈడబ్యూఎస్: 125
ఓబీసీ: 314
ఎస్సీ: 198
ఎస్టీ: 121
మొత్తం: 1438

దరఖాస్తు ఎలా చేయాలి..?

ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో అధికారిక లింక్ ద్వారా అభ్యర్థులు తమను తాము ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా తమ తాజా ఫోటోగ్రాఫ్, సంతకాన్ని స్కాన్ చేయాలి. నోటిఫికేషన్‌లోని ‘పత్రాన్ని ఎలా అప్‌లోడ్ చేయాలి’ కింద పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థి ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేస్తే చేయాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫారంను జాగ్రత్తగా పూరించాలి. పూర్తిగా నింపిన తర్వాత దానిని సమర్పించాలి.

ఒక అభ్యర్థి దరఖాస్తును ఒకేసారి పూరించలేకపోతే.. పాక్షికంగా పూరించిన 'ఫారమ్'ని సేవ్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా, సిస్టమ్ ద్వారా తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ & పాస్‌వర్డ్ రూపొందించబడి స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్ & పాస్‌వర్డ్‌ను జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. పాక్షికంగా పూరించిన & సేవ్ చేసిన దరఖాస్తు ఫారమ్‌ను రిజిస్ట్రేషన్ నంబర్ & పాస్‌వర్డ్‌ని ఉపయోగించి మళ్లీ తెరవవచ్చు-అప్పుడు అవసరమైతే వివరాలను సవరించవచ్చు. సేవ్ చేసిన సమాచారాన్ని సవరించే ఈ సదుపాయం మూడు సార్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు పూర్తిగా పూరించిన తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి.

అభ్యర్థి దరఖాస్తును ఒకేసారి అప్లికేషన్‌ను పూరించలేకపోతే.. అప్పటివరకు పూర్తి చేసిన 'ఫారమ్'ని సేవ్ చేయవచ్చు. ఇలా చేసిన తరువాత సిస్టమ్ ద్వారా తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ & పాస్‌వర్డ్ స్క్రీన్‌పై డిస్‌ ప్లే అవుతుంది. అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్ & పాస్‌వర్డ్‌ను జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. సేవ్ చేసిన దరఖాస్తును ఈ రిజిస్ట్రేషన్ నంబర్ & పాస్‌వర్డ్‌ని ఉపయోగించి మళ్లీ తెరవవచ్చు. అప్పుడు అవసరమైతే వివరాలను సవరించవచ్చు. అయితే సేవ్ చేసిన సమాచారాన్ని సవరించే సదుపాయం మూడు సార్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు పూర్తిగా నింపిన తరువాత.. దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.

కాంట్రాక్ట్ వ్యవధి..

ఉద్యోగి పనితీరుపై త్రైమాసిక సమీక్ష నిర్వహిస్తారు. 65 ఏళ్లు నిండిన పదవీ విరమణ చేసిన అధికారులు/సిబ్బందికి ఏది ముందు అయితే.. కాంట్రాక్టు కనిష్టంగా ఒక సంవత్సరం, గరిష్టంగా 3 సంవత్సరాలు ఉంటుంది.

శాలరీ ఎంత..? (నెలకు)

క్లరికల్- రూ.25 వేలు
JMGS-I- రూ. 35 వేలు
MMGS-II, MMGS-III- రూ.40 వేలు

అర్హత

డిసెంబరు 2022 నాటికి 63 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఎస్‌బీఐ రిటైర్డ్ అధికారి, సిబ్బంది, ఇతరులు ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి క్లీన్ రికార్డ్ కలిగి ఉండాలి. వారికి కేటాయించిన విధులలో వారికి పూర్తి నైపుణ్యం ఉండాలి. మరిన్ని వివరాల కోసం దయచేసి నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. 

గమనిక: ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఈ విషయంలో ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు ఉండవు.

Also Read: AP Police Recruitment 2022: ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్   

Also Read: Army Truck Accident: సిక్కింలో ఘోర ప్రమాదం.. 16 మంది సైనికులు మృతి   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More