Home> బిజినెస్
Advertisement

Sputnik V vaccine: సెప్టెంబర్ నుంచి సీరమ్‌లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీ

Sputnik V vaccine production at Serum Institute of India: పూణె: సెప్టెంబర్ నుంచి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారు చేయనుంది. ఈ మేరకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ డిమిట్రైవ్ వివరాలు వెల్లడించారు.

Sputnik V vaccine: సెప్టెంబర్ నుంచి సీరమ్‌లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీ

Sputnik V vaccine production at Serum Institute of India: పూణె: సెప్టెంబర్ నుంచి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారు చేయనుంది. ఈ మేరకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ డిమిట్రైవ్ వివరాలు వెల్లడించారు. భారత్‌లో ఏడాదికి 300 మిలియన్ల డోసుల వ్యాక్సిన్లు తయారు చేసే లక్ష్యంతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అసలు తయారీదారుల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా సెప్టెంబర్‌లో తొలి బ్యాచ్ వ్యాక్సిన్లు తయారు కానున్నాయని కిరిల్ తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానం బదిలీలో భాగంగా ఇప్పటికే రష్యాలోని గమలెయ సెంటర్ నుంచి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు (Serum Institute of India) సెల్, వెక్టార్ శాంపిల్స్ చేరుకున్నాయని కిరిల్ పేర్కొన్నారు. 

Also read: Corona Nasal Vaccine: నాసల్ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు, ఆశలు రేపుతున్న నాసల్ స్ప్రే వ్యాక్సిన్

ఇదిలావుంటే, భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో పాటు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ వంటి ఇతర ఫార్మాసుటికల్ కంపెనీలకు కూడా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారు చేసేందుకు (Dr Reddy's to start producing Sputnik V vaccine) అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. భారత్‌లో స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీ పెరిగితే, దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ (COVID-19 vaccine) సైతం ఇంకొంత వేగం ఊపందుకోనుంది అని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ భావిస్తోంది.

Also read : Covaxin Emergency Use: కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి WHO త్వరలోనే అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More