Home> బిజినెస్
Advertisement

Share Market Outlook : సోమవారం షేర్ మార్కెట్ మూడ్ ఎలా ఉంటుంది? ఏయే అంశాలు ప్రభావితం చూపుతాయి?

Share Market : ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఐదు రోజులకు బదులుగా నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ ఉంటుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. కాగా ఈ వారం కూడా దేశీయ ఇన్వెస్టర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ల కదలికలపై ఓ కన్నేసి ఉంచనున్నారు. చాలా కంపెనీల త్రైమాసిక ఫలితాలపై మార్కెట్ స్పందిస్తుంది. ఇన్వెస్టర్లు కూడా ద్రవ్యోల్బణం గణాంకాలపై ఫోకస్ పెట్టనున్నారు. 
 

Share Market Outlook : సోమవారం షేర్ మార్కెట్ మూడ్ ఎలా ఉంటుంది? ఏయే అంశాలు ప్రభావితం చూపుతాయి?

Stock Market : గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకున్నాయి. అయితే భారత మార్కెట్లు ఎలాంటి ఒడిదొడులకు లోనుకాలేదు. గతకొన్నాళ్లుగా ట్రేడింగ్ సెషన్లో ఇది భారీ హెచ్చుతగ్గులను చూసింది. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయం, జపాన్ లో వడ్డీ రేట్లు పెరగడం, దేశీయ మార్కెట్లో అధిక వాల్యుయేషన్ వంటి పలు అంశాలు స్టాక్ మార్కెట్ల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్ లో ఈ వారం ఎలాంటి పరిస్థితులు నెలకొననున్నాయి. సోమవారం షేర్ మార్కెట్ మూడ్ ఎలా ఉండనుంది. ఏయే అంశాలు ప్రభావితం కానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

మార్కెట్ కోసం ముఖ్యమైన కారకాలు:

-ఈ వారం అమెరికా, ఆసియా మార్కెట్లపై ఇన్వెస్టర్లు నిఘా పెట్టనున్నారు. 

-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత, ముడి చమురులు ధరలు కూడా స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేయనున్నాయి. 

-ఇక చాలా కంపెనీలు త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తాయి. మార్కెట్ వాటికి ప్రతిస్పందించాల్సి వస్తుంది. 

-ఈ వారం వచ్చే ద్రవ్యోల్బణం డేటాపై కూడా ఇన్వెస్టర్లు ఓ కన్నేయనున్నారు. 

-సెబీ చైర్ పర్సన్ పై హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు కూడా స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది. 

Also Read : Gold Rate Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే..?  

వోడాఫోన్, IRCTC త్రైమాసిక ఫలితాలు: 

2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు చాలా వరకు పెట్టుబడిదారులను నిరాశపరిచాయి. రైల్వే రంగంతో పాటు పలు కంపెనీల షేర్లలో భారీ క్షీణత కనిపించడానికి ఇదే కారణం. ఈ వారం కూడా హీరో మోటోకార్ప్, హిందాల్కో వంటి కొన్ని పెద్ద కంపెనీల ఫలితాలు రాబోతున్నాయి.వొడాఫోన్ ఐడియా, ఐఆర్ సిటిసి, ఎస్ జేవీఎన్, పీసీ జ్యువెల్లర్ కూడా ఈ వారంలో తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. 

నాలుగు రోజులే బిజినెస్: 

ఇక ఈ వారంలో 4 రోజులు మాత్రమే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ ఉండదు.  గత వారం, BSE సెన్సెక్స్ 1,276.04 పాయింట్లు లేదా 1.57 శాతం పడిపోయింది. అదే సమయంలో, NSE నిఫ్టీ 350.2 పాయింట్లు లేదా 1.41 శాతం క్షీణించింది. యెన్ క్యారీ ట్రేడ్ మూసివేయడం,అమెరికాలో మాంద్యం భయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు గత వారం డైవ్ తీసుకున్నాయి.

Also Read : Hindenburg : అదానీ, సెబీ చైర్ పర్సన్ పై ఉన్న ఆరోపణలు ఇవే..హిండెన్ బర్గ్ రిపోర్టును ఈ 10 పాయింట్లలో అర్థం చేసుకుందాం.!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More