Home> బిజినెస్
Advertisement

Credit Card Alert: క్రెడిట్ కార్డు హోల్డర్లకు బిగ్ ఎలర్ట్, ఇక నుంచి ఆ బ్యాంకు కార్డులపై కొత్త ఛార్జీలు

Credit Card Alert: క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్. ఇక నుంచి కొత్త ఛార్జీలు అమలు కానున్నాయి. ముఖ్యంగా రెండు రకాల లావాదేవీలపై అదనపు ఛార్జీలు పడనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Credit Card Alert: క్రెడిట్ కార్డు హోల్డర్లకు బిగ్ ఎలర్ట్, ఇక నుంచి ఆ బ్యాంకు కార్డులపై కొత్త ఛార్జీలు

క్రెడిట్ కార్డు వినియోగదారులు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పరిశీలిస్తుండాలి. లేకపోతే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. నవంబర్ 15 నుంచి క్రెడిట్ కార్డు నిబంధనల్లో కొత్తగా ఛార్జీల మోత పడనుంది. అయితే ఇది ఒక బ్యాంకుకు సంబంధించిందే. 

దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు కస్టమర్లకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఛార్జీలు విధిస్తోంది. క్రెడిట్ కార్డుకు సంబంధించి రెండు కీలక మార్పులు చేసింది. ఈఎంఐ లావాదేవాలపై ప్రాసెసింగ్ ఫీజును పెంచడమే కాకుండా..రెంటల్ పేమెంట్స్‌పై కూడా అదనంగా ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్ 15 నుంచి అమల్లో రానున్నాయి.

ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజును ఏకంగా 100 రూపాయలు పెంచింది. అంటే ఇక నుంచి 99 రూపాయలకు బదులు 199 రూపాయలు ప్లస్ జీఎస్టీ వసూలు కానుంది. అదే విధంగా రెంటల్ పేమెంట్స్‌పై కొత్తగా ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి రెంటల్ పేమెంట్స్‌పై కొత్తగా 99 రూపాయలు ప్లస్ జీఎస్టీ వసూలు చేయబోతోంది. 

ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు కూడా కొన్ని సేవలపై అదనంగా ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా థర్డ్ పార్టీ పేమెంట్స్ అందిస్తున్న రెంట్ పే ఆప్షన్‌పై దృష్టి పెట్టాయి. ఐసీఐసీఐ బ్యాంకు రెంట్ పేమెంట్స్‌పై 1 శాతం ఫీజు వసూలు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. 

వాస్తవానికి క్రెడిట్ కార్డు నుంచి క్యాష్ విత్‌డ్రాయల్ చేయాలంటే భారీగా వడ్డీ, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీల్నించి తప్పించుకునేందుకు క్రెడిట్ కార్డు హోల్డర్లు డబ్బులు అవసరమైనప్పుడు రెంట్ పేమెంట్ వంటి థర్డ్ పార్టీ మార్గాల్ని అనుసరిస్తుంటారు. ఇది గమనించిన ఎస్బీఐ, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు వీటిపై కూడా ఛార్జీలు విధిస్తున్నాయి. ఇతర బ్యాంకులు కూడా త్వరలో ఇదే మార్గాన్ని అనుసరించవచ్చు.

Also read: SBI Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ భారీగా పెంచిన ఎస్బీఐ, కొత్త వడ్డీ రేట్లు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More