Home> బిజినెస్
Advertisement

Saudi Arabia: భారత్‌ సహా 16 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించిన సౌదీ అరేబియా ప్రభుత్వం

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మానవాళిని మరో వైరస్ వెంటాడుతోంది. కరోనా కారణంగా అస్తవ్యస్థమైపోయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడో కోలుకుంటున్న తరుణంలో మరో వైరస్ దాడి చేస్తోంది. దీంతో కరోనా నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా ప్రపంచ దేశాలు గతంతో పోల్చితే ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలు జాగ్రత్తగా పాటిస్తున్నాయి. తగిన ప్రికాషన్స్  తీసుకుంటే మానవాళిని రక్షించుకోవచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా దేశాలతో పోల్చితే సౌదీ ముందు అడుగు వేసింది.

 Saudi Arabia: భారత్‌ సహా 16 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించిన సౌదీ అరేబియా ప్రభుత్వం

Saudi Arabia: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మానవాళిని మరో వైరస్ వెంటాడుతోంది. కరోనా కారణంగా అస్తవ్యస్థమైపోయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడో కోలుకుంటున్న తరుణంలో మరో వైరస్ దాడి చేస్తోంది. దీంతో కరోనా నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా ప్రపంచ దేశాలు గతంతో పోల్చితే ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలు జాగ్రత్తగా పాటిస్తున్నాయి. తగిన ప్రికాషన్స్  తీసుకుంటే మానవాళిని రక్షించుకోవచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా దేశాలతో పోల్చితే సౌదీ ముందు అడుగు వేసింది.

మంకీపాక్స్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియా అలర్ట్ అయింది. ఈ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగా  భారత్‌ సహా పదహారు దేశాలపై ట్యావెల్‌ బ్యాన్‌ విధించింది. దీనికి తోడు కరోనా ఇప్పుడిప్పుడే కంట్రోల్ అవుతున్న నేపథ్యంలో మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని  భావించిన సౌదీ అధికార యంత్రాంగం.... ప్రయాణాల పై  నిషేధం విధించింది. అయితే ఈ నిషేధం ఎంతకాలం అమలులో ఉంటుందని అనే దానిపై మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 

ఆఫ్రికా, ఆసియా, సౌత్‌ అమెరికా ఖండాలకు చెందిన మొత్తం పదహారు దేశాల నుంచి ప్రయాణికుల రాక పోకలపై సౌదీ ప్రభుత్వం నిషేధం విధించింది. భారత్‌,  సిరియా, లెబనాన్‌, ఇరాన్‌, టర్కీ, యెమెన్‌,అఫ్గనిస్థాన్‌,  కాంగో, సోమాలియా,  అర్మేనియా, లిబియా, బెలారస్‌, వెనిజులా.. ఇలా మొత్తం 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. సౌదీలో తాజాగా 414 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయని సౌదీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మార్చి, ఏప్రిల్ నెలలలో పోల్చితే ఈసారి కేసుల నమోదు ఇది ఐదు రెట్లు పెరగడంపై  ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి తోడు ఏకంగా 81 కరోనా మరణాలు చోటుచేసుకోవడంతో ట్రావెల్‌ బ్యాన్‌ విధించింది సౌదీ ప్రభుత్వం. 

అయితే ఈ పదహారు దేశాల మినహా మిగతా దేశాలకు చెందిన వాళ్లు యధావిధిగా రాకపోకలు కొనసాగించవచ్చని పేర్కొంది. అయితే ఎవరైనా సౌదీ వాసీ తప్పని సరి పరిస్థితుల్లో దేశం విడిచి వెళాల్సి వస్తే తప్పనిసరిగా ఆపాటికే మూడు డోసులు తీసుకొని ఉండాలని నిబంధన విధించింది. పన్నెండు నుంచి పదహారేళ్ల లోపు వయసు వాళ్లకు రెండు డోసులు ఉంటే చాలని ప్రకటించింది. ఆరోగ్యపరమైన మినహాయింపులు ఉంటే తప్ప.. ఎవరినీ బయటకు పంపేది లేదని క్లారిటీ ఇచ్చింది సౌదీ ప్రభుత్వం.

ALSO READ  YouTube New Features: యూట్యూబ్ యూజర్లకు శుభవార్త.. మరో రెండు ఫీచర్లు అందుబాటులో..!

ALSO READ  Petrol, Diesel Price Today: వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్రప్రభుత్వాలు.. పెట్రోల్-డీజిల్ ధరలు ఏ నగరంలో ఎంత..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More