Home> బిజినెస్
Advertisement

Safe & Best Cars in India: తక్కువ ధరలో వచ్చే బెస్ట్ సేఫ్టీ కార్లు

Safe & Best Cars in India: కొత్తగా కారు కొనుగోలు చేసే వారు ఒకప్పటిలా కేవలం తక్కువ ధర ఉండి, ఎక్కువ మైలేజ్ ఇస్తే మాత్రమే చాలు అని అనుకోవడం లేదు. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్‌తో పాటు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు. సేఫ్టీ రేటింగ్స్‌లో ఎక్కువ రేటింగ్ ఉండాలని చూస్తున్నారు.

Safe & Best Cars in India: తక్కువ ధరలో వచ్చే బెస్ట్ సేఫ్టీ కార్లు

Safe & Best Cars in India: కొత్త కారు కొంటున్నారా ? అయితే కారు కొనేముందు ఇప్పుుడు చాలామంది చెక్ చేస్తోన్న అంశం ఏంటో తెలుసా ? ఒకప్పటిలా కేవలం తక్కువ ధర ఉండి, ఎక్కువ మైలేజ్ ఇస్తే మాత్రమే చాలు అని అనుకోవడం లేదు. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్‌తో పాటు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు. సేఫ్టీ రేటింగ్స్‌లో ఎక్కువ రేటింగ్ ఉండాలని చూస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం తలెత్తినప్పుడు ప్రమాదం తీవ్రత ఎక్కువ లేకుండా, ఎక్కువ హాని లేకుండా కాపాడే కార్ల కోసం సెర్చ్ చేసి మరీ కొంటున్నారు. ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్న వివరాలు కూడా అలాంటివే. తక్కువ ధరలో.. అంటే రూ. 6 లక్షల ఎక్స్‌షోరూం ధర నుంచి మొదలుపెడితే రూ. 20 లక్షల వరకు వివిధ మోడల్స్ సేఫ్టీ రేటింగ్స్‌తో పాటు వాటి ధరల వివరాలు కూడా అందిస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం... కమాన్ చెకౌట్ దీస్ డీటేల్స్.  

రూ. 6 లక్షల నుంచే మొదలు

1 )
మోడల్ : వోక్స్ వ్యాగాన్ వర్చస్ 

అడల్ట్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

ఎక్స్‌షోరూం ధర : రూ. 11.48 లక్షల నుంచి రూ. 18.57 లక్షలు

సోర్స్ : స్పిన్నీ
 

2 )
మోడల్ : స్కోడా స్లేవియా

అడల్ట్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

ఎక్స్‌షోరూం ధర : రూ. 11.39 లక్షల నుంచి రూ. 18.68 లక్షలు

సోర్స్ : స్పిన్నీ

3 )
మోడల్ : వోక్స్‌వ్యాగాన్ టైగన్

అడల్ట్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

ఎక్స్‌షోరూం ధర : రూ. 11.62 లక్షల నుంచి రూ. 19.06 లక్షలు

సోర్స్ : స్పిన్నీ

4 )
మోడల్ : స్కోడా కుషాక్

అడల్ట్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

ఎక్స్‌షోరూం ధర : రూ. 11.59 లక్షల నుంచి రూ. 19.69 లక్షలు

సోర్స్ : స్పిన్నీ

5 )
మోడల్ : మహింద్రా స్కార్పియో N

అడల్ట్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ : 3 స్టార్

ఎక్స్‌షోరూం ధర : రూ. 11.59 లక్షల నుంచి రూ. 19.69 లక్షలు

సోర్స్ : స్పిన్నీ

6 )
మోడల్ : టాటా పంచ్

అడల్ట్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ : 4 స్టార్

ఎక్స్‌షోరూం ధర : రూ. 6 లక్షల నుంచి రూ. 9.47 లక్షలు 

సోర్స్ : స్పిన్నీ

7 )
మోడల్ : మహింద్రా XUV300

అడల్ట్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ : 4 స్టార్

ఎక్స్‌షోరూం ధర : రూ. 8.41 లక్షల నుంచి రూ. 14.14 లక్షలు

సోర్స్ : స్పిన్నీ

8 ) 
మోడల్ : టాటా ఆల్ట్రోజ్

అడల్ట్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ : 3 స్టార్

ఎక్స్‌షోరూం ధర : రూ. 6.45 లక్షల నుంచి రూ. 10.40 లక్షలు

సోర్స్ : స్పిన్నీ

9 )
మోడల్ : టాటా నెక్సాన్

అడల్ట్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

ఎక్స్‌షోరూం ధర : రూ. 7.80 లక్షల నుంచి రూ. 14.35 లక్షలు

ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రైమ్ బేస్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 14.49 లక్షలు నుంచి రూ. 17.19 లక్షలు

ఎలక్ట్రిక్ వెహికిల్ మ్యాక్స్ బేస్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 16.49 లక్షలు నుంచి రూ. 19.54 లక్షలు

సోర్స్ : స్పిన్నీ

10 )
మోడల్ : మహింద్రా XUV700

అడల్ట్ సేఫ్టీ రేటింగ్స్ : 5 స్టార్

చైల్డ్ సేఫ్టీ రేటింగ్స్ : 4 స్టార్

ఎక్స్‌షోరూం ధర : ఎక్స్‌షోరూం ధర : రూ. 13.45 లక్షల నుంచి రూ. 25.48 లక్షలు

సోర్స్ : స్పిన్నీ

Read More