Home> బిజినెస్
Advertisement

FD Interest Rates: రెపోరేటు పెరగకపోయినా..FD వడ్డీ రేటు పెంచిన IOB.. ఇవాళ్టి నుంచే అమలు!

FD Interest Rates in IOB Bank: ఆర్బీఐ రెపో రేట్ల ఆధారంగా బ్యాంకుల వడ్డీ నిర్ణయమౌతుంటుంది. రెపో రేటు పెరిగితే వడ్డీ పెరగడం, తగ్గితే వడ్డీ రేటు తగ్గడం సాధారణమే. ఇటీవల వరుసగా రెపో రేట్లు పెంచుతున్న ఆర్బీఐ తాజాగాగా ఏ మార్పు చేయలేదు..

FD Interest Rates: రెపోరేటు పెరగకపోయినా..FD వడ్డీ రేటు పెంచిన IOB.. ఇవాళ్టి నుంచే అమలు!

FD Interest Rates in IOB Bank: అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటులో ఏ మార్పు చేయకపోయినా ఒక బ్యాంకు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ధరను పెంచింది. కొత్త వడ్డీ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇవాళ్టి నుంచి అమలు కానున్న కొత్త వడ్జీ ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. ఆర్బీఐ ఏప్రిల్ 6వ తేదీన ద్రవ్య విధానంపై సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో రెపో రేటు మార్చేందుకు ఆర్బీఐ నిరాకరించింది. కానీ చాలా బ్యాంకులు ఎఫ్‌డిలు పెంచేందుకు వాటిపై వడ్డీని పెంచాయి.

0.40 శాతం వడ్డీ పెంచిన ఐవోబీ

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎఫ్‌డిలపై వడ్డీ రేటును 0.40 శాతం పెంచేందుకు నిర్ణయించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త వడ్లీ రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. కస్టమర్లకు 444 రోజల ఎఫ్‌డిలపై వడ్డీ రేటు ఇప్పుడు 8 శాతం వరకూ ఇవ్వనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఓవైపు ఎంపిక చేసిన కాలానికి వడ్డీ ధరల్లో 0.50 శాతం తగ్గించింది. మరోవైపు కొన్ని సెలెక్టెడ్ టైమ్ కోసం ఇందులో 0.40 శాతం వడ్డీ పెంచింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం..బ్యాంకు 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డిలపై వడ్డీ మార్చింది. కొత్త ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ధరలు ఇవాళ ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి.

444 రోజులకు 7.25 శాతం వడ్డీ

మార్పుల తరువాత 444 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు ఇప్పుడు 7 శాతం కాకుండా 7.25 శాతం వడ్డీ ఇస్తాయి. సీనియర్ సిటిజన్ల కోసం 0.50 శాతం నుంచి, మోస్ట్ సీనియర్ సిటిజన్ల కోసం 0.75 శాతం వడ్డీ చెల్లిస్తుంది.

Also Read: Yamaha MT 15 V2: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో యమహా MT15 v2 అప్‌డేట్ వెర్షన్‌, తక్కువ బడ్జెట్‌లోనే.. 56.87 kmpl కంటే ఎక్కువ మైలేజీ!

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కొత్త ఎఫ్‌డి ధరలు

ఐవోబీ బ్యాంకు తన కస్టమర్లకు 7 రోజుల్నించి 14 రోజుల వరకూ ఉండే ఎఫ్‌డిలపై 4 శాతం, 15 రోజుల్నించి 29 రోజుల వరకైతే  4 శాతం, 30-45 రోజుల ఎఫ్‌డీలపై 4.25 శాతం‌, 46 నుంచి 60 రోజుల ఎఫ్‌డిలపై 4.25 శాతం లభిస్తుంది. ఇక 61 రోజుల్నించి 90 రోజుల ఎఫ్‌డీలపై 4.25 శాతం, 91 రోజుల్నించి 120 రోజుల వరకూ ఉండే ఎఫ్‌డీలపై 4.50 శాతం,  121 రోజుల్నించి 179 రోజుల వరకూ 4.50 శాతం వడ్డీ లభించనుంది.

ఇక 180 రోజుల్నించి 269 రోజుల వరకూ ఎఫ్‌డీలపై 4.95 శాతం, 270 రోజుల్నించి 1 ఏడాది వరకూ 5.35 శాతం, 1-2 ఏళ్ల వరకూ 6.50 శాతం వడ్డీ లభిస్తుంది.

Also Read: Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో 26 వేల రియల్‌మి స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం 999 రూపాయలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More