Home> బిజినెస్
Advertisement

Jio Recharge Plan: రిలయన్స్ జియోలో ఏ ప్లాన్ ఎంత పెరిగింది, ఎప్పట్నించి అమలు

Jio Recharge Plan: ఒకదాని తరువాత ఒకటిగా ప్రైవేట్ టెలీకం కంపెనీలు ఛార్జీలు పెంచుతున్నాయి. దాదాపుగా అన్ని ప్లాన్స్ ఖరీదు పెరుగుతోంది. జూలై 3 నుంచి కొత్త టారిఫ్ అమలు కానుంది. ఈ క్రమంలో రిలయన్స్ జియో కొత్త టారిఫ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Jio Recharge Plan: రిలయన్స్ జియోలో ఏ ప్లాన్ ఎంత పెరిగింది, ఎప్పట్నించి అమలు

Jio Recharge Plan: దేశంలోని మూడు ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ పోటీపోటీగా టారిఫ్ ప్లాన్స్ పెంచుతుంటే మూడో కంపెనీ వోడాపోన్ ఐడియా సైతం అదే పని చేపట్టింది. రిలయన్స్ జియో పెంచిన టారిఫ్ ప్లాన్స్ ఇలా ఉండనున్నాయి. 

రిలయన్స్ జియో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీగా ఉంది. మొబైల్ రీఛార్జ్‌ను జియో 12 నుంచి 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త టారిఫ్ ప్లాన్స్ జూలై 3 నుంచి అమల్లో రానున్నాయి. దాదాపు రెండున్నరేళ్ల తరువాత మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ పెంచడం ఇదే. టెలీకం పరిశ్రమలో ఇన్నేవేషన్, స్నేహపూర్వక వాతావరణం పెంపొందించడం, 5జి, ఏఐ టెక్నాలజీలో పెట్టుబడికి కొత్త ప్లాన్స్ కీలకమని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. దాదాపు మూడు ప్లాన్స్‌ల టారిఫ్ పెంచింది కంపెనీ. 

రిలయన్స్ జియోలో అతి తక్కువ ప్లాన్ ఇప్పుడు 19 రూపాయలుగా ఉంది. ఇది యాడ్ ఆన్ డేటాలో 1 జీబీ ప్లాన్. ఇంతకుముందు ఇది 15 రూపాయలుండేది. దాదాపు 25 శాతం పెరిగింది. ఇక 399 రూపాయలకు లభ్యమయ్యే 75 జీబీ పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్ ఇప్పుడు 449 రూపాయలయ్యింది. ఇక అత్యధికంగా వినియోగించే ప్రాచుర్యం పొందిన 666 రూపాయల ప్లాన్ 20 శాతం పెరిగి 799 రూపాయలయ్యింది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా కావడంతో చాలా ఎక్కువమంది వినియోగిస్తున్నారు. ఇప్పుడిక ఈ ప్లాన్ వినియోగదారులపై ఏకంగా 133 రూపాయలు భారం పెరిగింది. 

ఇక వార్షిక ప్లాన్స్ కూడా 20-21 శాతం పెరిగాయి. వీటిలో 1559 రూపాయల ప్లాన్ 1899 రూపాయలు కాగా, 2,999 రూపాయల ప్లాన్ 3599 రూపాయలైంది. రోజుకు 2 జీబీ డేటా లభించే అన్ని ప్లాన్స్‌పై అన్ లిమిటెడ్ 5జి డేటా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కొత్త ప్లాన్స్ జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. 

Also read: Bank Holidays: జూలై నెల బ్యాంకు సెలవులు.. 12 రోజులు బ్యాంకులు బంద్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More