Home> బిజినెస్
Advertisement

Jio Prepaid Plans: జియో అందిస్తున్న అతి చౌకైన ప్రీ పెయిడ్ ప్లాన్, ప్రయోజనాలు ఇలా

Jio Prepaid Plans: జియో యూజర్లపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. జియో అన్‌లిమిటెడ్ ప్లాన్స్‌తో భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. జియో అందిస్తున్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం..

Jio Prepaid Plans: జియో అందిస్తున్న అతి చౌకైన ప్రీ పెయిడ్ ప్లాన్, ప్రయోజనాలు ఇలా

జియో అన్‌లిమిటెడ్ ప్లాన్స్‌లో భాగంగా జియో ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో వచ్చింది. ఇది మీ బడ్జెట్‌కు ఫిట్ అవడమే కాకుండా..చాలా ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. అసలీ ప్లాన్ ఏంటి, ఏ విధమైన ప్రయోజనాలు లభిస్తున్నాయనే వివరాలు తెలుసుకుందాం.

జియో అందిస్తున్న ఈ ప్లాన్ కేవలం 299 రూపాయలే. ఇందులో కస్టమర్లకు చాలా ప్రయోజనాలు అందుతాయి. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే దాదాపుగా నెలరోజుల వ్యాలిడిటీ. ఈ వ్యాలిడిటీతో పాటు కస్టమర్లకు ఈ ప్లాన్‌లో 56 జీబీ హైస్పీడ్ డేటా ఇంటర్నెట్ కూడా లభిస్తుంది. ఇంటర్నెట్ సర్ఫింగ్ కూడా చేసుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. దాంతోపాటు ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా ఉంటుంది. దేశంలో ఎక్కడికైనా ఫోన్ చేసుకోవచ్చు. అంతేకాదు..ఇందులో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. ఈ ప్లాన్‌తో పాటు కొన్ని యాప్స్ కూడా ఉచితంగా లభిస్తాయి. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ఉన్నాయి.

Also read: Income Tax: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఏ స్లాబ్‌లో ఎంత ట్యాక్స్ పే చేయాలంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More