Home> బిజినెస్
Advertisement

RBI కీలక నిర్ణయం: సామాన్యులే కాదు ఇకపై బ్యాంకులు కూడా జరిమానా కట్టాల్సిందే!

జరిమానాలను, అదనపు చార్జీలను సామాన్యుల దగ్గర ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు కూడా ఇకపై నగదు లేని ఏటీఎం(ATM) లపై భారీ జరిమానాలను వసూలు చేసే నిబంధన ఆర్బీఐ (RBI) తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుండి అన్ని బ్యాంకులకు ఈ నిబంధన వర్తించనుంది. 

RBI కీలక నిర్ణయం: సామాన్యులే కాదు ఇకపై బ్యాంకులు కూడా జరిమానా కట్టాల్సిందే!

RBI New Rules: ఏటీఎంలలో(ATM) వచ్చే డబ్బు కొరత కారణంగా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని,  ఆర్బీఐ (RBI)  ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మన అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచని ఎడల బ్యాంకులు ఎలా అయితే అదనపు చార్జీలు వసూలు చేస్తాయో.. అలాగే ఇక నుండి బ్యాంకులు నిర్వహిస్తున్న ఏటీఎంలలో నగదు గనుక అందుబాటులో లేకపోతే ఆర్బీఐ (RBI) వారి పైన భారీ జరిమానులు వసూలు చేసే నిర్ణయాన్ని తీసుకుంది. 

ఇకపై బ్యాంకులు నిర్వహించే ఏటీఎంలలో(ATM) నెలకు మొత్తంగా 10 గంటలు డబ్బులు అందుబాటులో లేని బ్యాంకులకు (BANK) 10 వేల రూపాయలు జరిమానా విధిస్తామని ఆర్బీఐ (RBI) ప్రకటించింది. 

Also Read: పిఎంయువై స్కీమ్: ఉజ్వల 2.0 తో నిరుపేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్స్

ఈ నిబంధన అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానుండగా, నగదు లేని  ఏటీఎం వలన ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను గురించి తమ దృష్టికి వచ్చినట్టు, ఈ సమస్యను పరిష్కరించటానికే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు RBI తెలిపింది.  

బ్యాంకులు ఎప్పటికప్పుడు ఏటీఎంలలో(ATM) నగదు లభ్యతను పర్యవేక్షించి, సమయానికి భర్తీ చేసేలా తమ యంత్రాంగాలను పటిష్టం చేసుకోవాలని ఆర్బీఐ (RBI) సూచించింది. బ్యాంకులతో పాటు వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లకూ (డబ్ల్యూఎల్‌ఏవో) కూడా కొత్త నిబంధన వర్తించనుంది. 

ఒకవేళ నిబంధలను అతిక్రమించిన, ఉల్లగించిన తీవ్రంగా పరిగణిస్తామని, జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ (RBI) హెచ్చరించింది. 

Also Read: వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న గూగుల్, వేతనంలో కోత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More