Home> బిజినెస్
Advertisement

Can we Accept Rs 2000 Notes: రూ. 2000 నోటు తీసుకుంటే సమస్య తప్పదా ? ఏంటా సమస్య ?

Can we Accept Rs 2000 Notes: 2000 రూపాయల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది డీమానిటైజేషన్ కాదని, నోట్ల మార్పిడి అని తేల్చిచెప్పిన ఆర్బీఐ...  సెప్టెంబర్30 వరకే ఈ నోట్లు చలామణిలో ఉంటాయని స్పష్టంచేసింది.

Can we Accept Rs 2000 Notes: రూ. 2000 నోటు తీసుకుంటే సమస్య తప్పదా ? ఏంటా సమస్య ?

Can we Accept Rs 2000 Notes : 2000 రూపాయల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది డీమానిటైజేషన్ కాదని, నోట్ల మార్పిడి అని తేల్చిచెప్పిన ఆర్బీఐ...  సెప్టెంబర్30 వరకే ఈ నోట్లు చలామణిలో ఉంటాయని స్పష్టంచేసింది. క్లీన్ నోట్ పాలసీని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజలు 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు ఉంది. 

రోజుకు ఎన్ని రూపాయలు అనుమతిస్తారంటే..
ఒక్కొక్కరికి ఒక్క రోజుకు 20,000 రూపాయలు మాత్రమే నోట్లు మార్చుకోవడానికి అనుమతిస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. 2000 రూపాయల నోట్లను ఒక్కరికి ఒక్కసారి 10 వరకే మార్చోకోవచ్చు. 2 వేల రూపాయల నోటుపై ఆర్బీఐ చేసిన ప్రకటన జనంలో అనేక అనుమానాలకు తావిచ్చింది. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే.. ఇకపై ఎవరైనా రూ 2000 నోట్లను మీకు ఇస్తే, మీరు ఆ నోటును తీసుకోవచ్చా లేదా అనేదే చాలా మంది బుర్రలను తొలిచేస్తోన్న సందేహం. ఇదే విషయమై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.

నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి
టాక్సేషన్ ఎక్స్‌పర్ట్ సునీల్ గార్గ్ జీ న్యూస్‌కి చెందిన బిజినెస్ ఛానెల్ అయిన జీ బిజినెస్‌తో మాట్లాడుతూ, ప్రస్తుతానికి రూ. 2 వేల నోటు చెల్లుబాటు అవుతుంది కనుక ఈ నోటును లావాదేవీలకు ఉపయోగించడంలో ఎటువంటి సమస్య ఉండదు అని అన్నారు. కాకపోతే ఎలాగూ బ్యాంకులో నోటు మార్చుకోవడానికి అవకాశం ఉంది కనుక నేరుగా బ్యాంకుకే వెళ్లి నోటును మార్చుకోవడం సరైన నిర్ణయం అవుతుంది అని అన్నారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తులు ఇచ్చిన నోట్లు మీ వద్ద ఎక్కువ మొత్తంలో ఉంటే.. బ్యాంకులో మార్చుకోవడానికి వెళ్లినప్పుడు, అవి ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్న తలెత్తే అవకాశం లేకపోలేదు అని సునీల్ గార్గ్ తెలిపారు.

ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఒకవేళ మీరు బ్యాంకులో 50 వేలకు పైగా నగదు లావాదేవీలు చేస్తున్నట్టయితే, మీరు మీ పాన్ కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. అలాంటప్పుడు మీ వద్ద ఉన్న రూ. 2000 నోట్లు ఎక్కువ మొత్తంలో ఉంటే, మీరు బ్యాంకులో మార్చుకునేటప్పుడు మీ పాన్ నెంబర్ ఇవ్వడం వల్ల మీ వద్ద ఉన్న డబ్బుల గురించి మీరు ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సి రావొచ్చు. ఒకవేళ ఆ డబ్బులు మీకు ఎలా వచ్చాయంటే మీరు ఆదాయ పన్ను అధికారులకు సరైన సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. 

అలాంటి పొరపాటు అస్సలే చేయొద్దు..
ఏదేమైనా రోజుకు 10 నోట్లు చొప్పున రోజూ 20 వేల రూపాయలు నోట్లు మార్చుకున్నట్టయితే.. పాన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కనుక మీరు సెప్టెంబర్ 30 వరకు మొత్తం ఎన్ని డబ్బులు బ్యాంకులో మార్చుకున్నారు అనే వివరాలు తెలిసే అవకాశం ఉండదు అని అనుకోవద్దు. ఎందుకంటే.. మీ బ్యాంకు ఖాతాలకు ఇప్పటికే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉన్నాయి కనుక మీ ఖాతాలో జరిగే ప్రతీ రూపాయికి సంబంధించిన లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందుతుంది. మీ ఆదాయ పన్ను పరిమితికి మించిన మొత్తం మీ ఖాతాలో జమ అయినట్టయితే.. ఇన్ కమ్ టాక్స్ అధికారుల నుంచి మీకు నోటీసులు వచ్చే ప్రమాదం లేకపోలేదనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఎవరైనా మీ ద్వారా నోట్లను మార్చుకోవాలని కానీ లేదా మీ ఖాతాలో జమ చేయాలని కానీ ప్రయత్నిస్తే.. అందుకు నో చెప్పడమే ఉత్తమం అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

ఇది కూడా చదవండి : FAQs About Rs 2000 Note: 2000 నోటు ఎప్పటివరకు చెల్లుతుంది ? ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చా ?

ఒక్కముక్కలో చెప్పాలంటే.. 
ఒక్కముక్కలో చెప్పాలంటే.. సెప్టెంబర్ 30 వరకు రూ. 2000 నోటు చలామణిలో ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టంచేసినందున ఆ నోటును ఎవరైనా ఇస్తే తీసుకోవడంలో చట్టపరమైన ఇబ్బందులు లేనప్పటికీ.. సెప్టెంబర్ 30 లోగా ఆ నోటును మార్చుకోవడానికి వెళ్లినా లేదా డిపాజిట్ చేయడానికి వెళ్లినా.. మీ ఆదాయ పన్ను పరిమితికి మించిన మొత్తంలో మీవద్ద ఆ నోట్లు ఉన్నట్టయితే.. మీరు ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : Rs 2000 Notes Why and What: ఆర్బీఐ రూ. 2000 నోటును ఎందుకు ఉపసంహరించుకుందో తెలుసా ?

ఇది కూడా చదవండి : Rs 2000 Currency Notes: 2 వేల నోట్ల రద్దుపై ఎవరేం అన్నారంటే..

ఇది కూడా చదవండి : RBI to Withdraw Rs 2000 Note: బడాబాబులకు మరోసారి షాకిచ్చిన కేంద్రం.. రూ. 2 వేల నోటు మళ్లీ వెనక్కి

Read More