Home> బిజినెస్
Advertisement

Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలో ఎందుకు లేవు, రాష్ట్రాలే కారణమా

Petrol-Diesel Price: త్వరలో ఇంధన ధరలు తగ్గనున్నాయి. కేంద్ర మంత్రి దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఇంధన ధరల తగ్గింపుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలో ఎందుకు లేవు, రాష్ట్రాలే కారణమా

పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరల్నించి ఉపశమనం కలగనుంది. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కేంద్ర పెట్రోలియం, సహజవాయవు శాఖ మంత్రి హర్దీప్ సింహ్ పూరీ చేసిన ప్రకటన సారాంశమిది. ఆ వివరాలు మీ కోసం..

దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల్నించి త్వరలో ఉపశమనం కలగనుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిథిలో తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉందని..కానీ రాష్ట్రాల్నించి ఈ విషయమై ఆమోదం లభించడం లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింహ్ పూరీ వెల్లడించారు. పెట్రోల్-డీజిల్ ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చేందుకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరిగా ఉండాలని..రాష్ట్రాలు సంసిద్ధమైతే కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమని కేంద్రమంత్రి తెలిపారు.

ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలపై పెట్టేసిందని కేంద్రమంత్రి వ్యాఖ్యలతో స్పష్టమైంది. అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైతే పెట్రోల్-డీజిల్ ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో రావచ్చు. ఫలితంగా పెరుగుతున్న ధరలు తగ్గుతాయి.

కేంద్రమంత్రి చెప్పిందేంటి

మేం ముందు నుంచే దీనికోసం సిద్ధంగా ఉన్నాం. నాకు ఈ విషయం తెలుసు. దీనిని అమలు చేసే విషయం వేరేలా ఉంది. ఈ ప్రశ్నను ఆర్ధికమంత్రి సమక్షంలో వేయాల్సింది. రాష్ట్రాలు ఈ విషయంపై అంగీకారం తెలిపే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాష్ట్రాల ఆదాయంలో ప్రధాన మార్గం మద్యం, పెట్రోల్ ఉత్పత్తులపై విధించే పన్నులే.

ఇది అర్ధం చేసుకోవడం అంత కష్టమేం కాదు. రాష్ట్రాలకు దీన్నించి ఆదాయం లభిస్తుంది. ఆదాయం పొందుతున్నప్పుడు రాష్ట్రాలు ఎందుకు వదిలేస్తాయి. కేవలం కేంద్ర ప్రభుత్వమే ధరల పెరుగుదల, ఇతరత్రా అంశాలపై చింతిస్తుంటుంది. కేరళ హైకోర్టు నిర్ణయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. జీఎస్టీ మండలిలో ఈ విషయాన్ని లేవనెత్తాలని సూచించారు. కానీ రాష్ట్రాల ఆర్ధికమంత్రులు దీనికి సంసిద్ధంగా లేరు. 

పెట్రోల్-డీజిల్‌పై జీఎస్టీ ఎందుకు లేదు

పెట్రోల్-డీజిల్ ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలో తీసుకురాకపోవడం వెనుక రాష్ట్రాలు కోల్పోయే ఆదాయం ప్రధాన కారణం. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్-డీజిల్ ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలో తీసుకొస్తే..జీఎస్టీలోని టాప్ స్లాబ్‌లో ఈ రెండింటినీ ఉంచుతారు. అప్పుడు కూడా సంపాదనలో చాలా కోల్పోతారు. అందుకే రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ఉత్పుత్తుల్ని జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చేందుకు అనుమతించడం లేదు.

పెట్రోల్ డీజిల్ ధరల్లో తగ్గింపు

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్‌దీప్ సింహ్ పూరీ స్పందించారు. గత ఏడాది కాలంగా ఇంధన ధరల్లో వచ్చిన పెరుగుదల ప్రపంచం మొత్తం మీద పోలిస్తే..ఇండియాలో నే తక్కువని చెప్పారు.ఇండియా ప్రపంచంలో ఓ మంచి స్థితిలో ఉంది. ధరలు నియంత్రణలో ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. 

Also read: Crypto Market: భారీగా పతనమైన క్రిప్టోకరెన్సీ, ఇండియాపై ఏ మేరకు ప్రభావం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More