Home> బిజినెస్
Advertisement

Petrol rate in India: దేశంలో ఆగని పెట్రో మంట- కోల్​కతాలో రూ.100 దాటిన లీటర్ డీజిల్ ధర

Petrol rates today: దేశంలో ఇంధన ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. గురువారం పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి పెరిగాయి. కోల్​కతాలో కూడా డీజిల్​ ధర రూ.100 దాటింది.

Petrol rate in India: దేశంలో ఆగని పెట్రో మంట- కోల్​కతాలో రూ.100 దాటిన లీటర్ డీజిల్ ధర

Petrol Price in India: పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గురువారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను (Fuel price hiked) పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలకు అనుగుణంగానే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చెబుతున్నాయి.

ఇప్పటికే జీవనకాల గరిష్ఠం వద్ద కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు గురువారం మరో కొత్త రికార్డు స్థాయికి చేరాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు

హైదరాబాద్​లో పెట్రోల్ (Petrol price in Hyderabad) ధర లీటర్​ 36 పైసలు పెరిగి.. రూ.112.59 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర (Diesel Price in Hyderabad) 38  పైసలు పెరిగి.. రూ.105.80 వద్ద ఉంది.

విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్​, డీజిల్ ధరలు 35, 36 పైసల చొప్పున పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర (Petrol price in Vizag) రూ.113.33 వద్ద, డీజిల్ ధర (Diesel price in Vizag) రూ.105.96 వద్ద ఉన్నాయి.

Also read: LPG Price hike: మరోసారి వంట గ్యాస్ ధరల మంట- వచ్చే వారం రూ.100 వరకు పెరిగే అవకాశం!

Also read: 5G Network: ఇండియాలో 5జీ నెట్‌వర్క్ మరింత ఆలస్యం కానుందా, కారణమేంటి

ఇతర మెట్రో నగరాల్లో ఇంధన ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర (Petrol Price in Delhi) 35 పైసలు, డీజిల్ ధర లీటర్​ 35 పైసలు పెరిగింది. దీనితో పెట్రోల్, డీజిల్ (Diesel Price in Delhi) ధరలు లీటర్​కు వరుసగా.. రూ.108.29, రూ.97.03 వద్ద ఉన్నాయి.

చెన్నైలో పెట్రోల్ ధర (Petrol Price in Chenni) లీటర్​ 31 పైసలు పెరిగి.. రూ.105.10 వద్ద ఉంది. లీటర్ డీజిల్ (Diesel Price in Chenni) ధర 34 పైసలు పెరిగి.. రూ.101.22 వద్దకు చేరింది.

బెంగళూరులో పెట్రోల్ ధర (Petrol Price in Bengaluru) లీటర్​ 36 పైసలు పెరిగి రూ.112.02 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగి (Diesel Price in Bengaluru) రూ.102.94 వద్దకు చేరింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర లీటర్​ 34 పైసలు పెరిగి (Petrol Price in Mumbai)రూ.114.10కి చేరింది. లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగి రూ.105.08 వద్ద (Diesel Price in Mumbai) కొనసాగుతోంది.

కోల్​కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటర్​కు.. 34 పైసలు, 35 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్​ (Petrol Price in Kolkata) పెట్రోల్ ధర రూ.108.75 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్​ (Diesel Price in Kolkata) రూ.100.10 వద్ద కొనసాగుతోంది.

రాజస్థాన్​లోని గంగానగర్​లో పెట్రోల్​, డీజిల్ ధరలు రికార్డు స్థాయి వద్ద ఉన్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.120.42 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర రూ.113.09వద్ద ఉంది.

Also read: PhonePe transaction charges: ఫోన్ పే యూజర్స్‌కి షాక్.. మొబైల్ రీచార్జీపై ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు

Also read: Matchbox Price: అగ్గిపెట్టె రూ.2.. డిసెంబరు 1 నుంచి అమలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More