Home> బిజినెస్
Advertisement

Petrol Diesel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతుందంటే?

March 29th 2022 Petrol, Diesel Prices In Hyderabad. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధరపై 90 పెసలు పెరిగి.. రూ. 113.61 చేరింది. ఇక లీటర్‌ డీజిల్‌ ధరపై 76 పైసలు పెరిగి.. రూ. 99.83గా ఉంది. 

Petrol Diesel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతుందంటే?

Petrol Rate on March 29th 2022 was hiked by 90 paise a litre in Hyderabad: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు రోజురోజుకూ పెంచుతూనే ఉన్నాయి. గత 3-4 రోజులుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు.. ఈరోజు కూడా పెరిగాయి. మంగళవారం (మార్చి 29) లీటర్‌ పెట్రోల్‌పై 80 పైసలు, డీజిల్‌ పై 70 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. గడిచిన ఎనమిది రోజుల్లో చమురు ధరలు పెరగడం ఇది ఏడోసారి కావడం విశేషం. 

మంగళవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.61, డీజిల్‌ ధర రూ.99.83కి చేరుకుంది. మరోవైపు విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.115.37లుగా ఉండగా.. డీజిల్‌ రూ.101.23గా నమోదైంది. ఇక గుంటూరులో రూ.115.57, డీజిల్‌ రూ.101.43లుగా ఉంది. 

తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100.21గా ఉండగా.. డీజిల్ లీటరుకు రూ.91.47గా నమోదైంది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.115.04లుగా ఉండగా.. డీజిల్‌ రూ.99.25గా ఉంది. చెన్నైలో రూ.105.94, డీజిల్‌ రూ.96.00లుగా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.68లుగా ఉండగా.. డీజిల్‌ రూ.94.62గా నమోదైంది. గత వారం రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు దాదాపు రూ.5 చొప్పున పెరిగాయి. 

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా.. రికార్డు స్థాయిలో 137 రోజులు పెట్రోలు, డీజిల్‌ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర నవంబరులో 82 డాలర్లుగా ఉండగా.. మార్చి ఆరంభంలో 111 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఓ సమయంలో బ్యారెల్‌ ధర 139 డాలర్లకు కూడా చేరింది. అయినప్పటికీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల్లో మార్పులు చేయలేదు. ఇక గత వారం నుంచి బాదుడు మొదలైంది. నిపుణుల అంచనా ప్రకారం రూ. 120-125 వరకు పోయే అవకాశం ఉంది. 

Also Read: Sanskiti Mahotsav: వరంగల్ వేదికగా రెండ్రోజులపాటు జాతీయ సంస్కృతి మహోత్సవాలు

Also Read: SRH vs RR: సరికొత్తగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎదురొచ్చిన జట్టును ఏసుకుంటూ పోవుడే ఇగ!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More