Home> బిజినెస్
Advertisement

Paytm crisis: పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు, ఫాస్టాగ్ పనిచేస్తుందా లేదా, ఏం చేయాలి మరి

Paytm crisis: ప్రముఖ యూపీఐ పేమెంట్ దిగ్గజం పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపధ్యంలో యూజర్లలో గందరగోళం నెలకొంది. పేటీఎం సంబంధిత అంశాలు ఎలా ప్రభావితమౌతాయనేది తెలియక ఇబ్బంది పడుతున్నారు. 
 

Paytm crisis: పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు, ఫాస్టాగ్ పనిచేస్తుందా లేదా, ఏం చేయాలి మరి

Paytm crisis: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినమైన ఆంక్షలు మార్కెట్‌లో సంచలనంగా మారాయి. ఇకపై ఎలాంటి డిపాజిట్లు స్వీకరించలేని పరిస్థితి నెలకొంది. దాంతో పేటీఎం యూజర్లలో ఆందోళన నెలకొంది. ఫిబ్రవరి 29 తరువాత పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. 

ప్రముఖ యూపీఐ దిగ్గజం పేటీఎంపై ఆంక్షల నేపధ్యంలో ఫిబ్రవరి 29 తరువాత చాలా రకాల అంశాలు ప్రభావితం కానున్నాయి. అయితే ఏయే అంశాలు ప్రభావితమౌతాయి, ఏవి కావనే విషయంలో చాలా సందేహాలున్నాయి. ఫిబ్రవరి 29 తరువాత  కూడా ఫాస్టాగ్ పనిచేస్తుంది కానీ అందులో కొత్తగా డబ్బులు యాడ్ చేయడానికి వీలుండదు. అంటే పేటీఎం యాప్‌ను ఇకపై టాప్ అప్ చేసుకోవడం సాధ్యం కాదు. వ్యాలెట్‌లో డబ్బులు అయిపోతే మరో బ్యాంక్ ఫాస్టాగ్ తీసుకోవల్సి వస్తుంది. ఆర్బీఐ విధించిన ఆంక్షల్లో మార్పుల్లేకుంటే ఇక ఫాస్టాగ్ మార్చుకోవల్సిందే.

పేటీఎం ఫాస్టాగ్‌ను మరో బ్యాంక్‌కు మార్చుకునేందుకు ప్రస్తుతానికి అనుమతి లేదు. అంటే పోర్ట్ ఫెసిలిటీ ఇంకా అందుబాటులో రాలేదు. అందుకే కొత్తది తీసుకోకతప్పదు. తగినంత బ్యాలెన్స్ లేకుంటే పేటీఎం ఫాస్టాగ్ పనిచేయదనే విషయం గుర్తుంచుకోవాలి. పేటీఎం ఫాస్టాగ్‌పై చాలామంది ఆధారపడి ఉన్నారు. అందుకే తన యూజర్లపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేటీఎం చెబుతోంది. కానీ ఇది ఎలా సాధ్యమౌతుందనేది క్లారిటీ లేదు. 

Also read: AP Politics: తెలంగాణలో ప్రభుత్వం త్వరలో కూలిపోనుందా, విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More