Home> బిజినెస్
Advertisement

Paytm Crisis: మరింత జటిలం కానున్న పేటీఎం పరిస్థితి, త్వరలో ఈడీ దర్యాప్తు

Paytm Crisis: ప్రముఖ యూపీఐ యాప్ పేటీఎంపై జరుగుతున్న పరిణామాలు తీవ్ర గందరగోళానికి కారణమౌతున్నాయి. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ విషయంలో కలగజేసుకునే పరిస్థితి ఉండటంతో షేర్ హోల్డర్లలో ఆందోళన రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Paytm Crisis: మరింత జటిలం కానున్న పేటీఎం పరిస్థితి, త్వరలో ఈడీ దర్యాప్తు

Paytm Crisis: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ పేటీఎం వివాదం రోజురోజుకూ తీవ్రమౌతోంది. ఆర్బీఐ ఆంక్షల నేపధ్యంలో పేటీఎం యూజర్లు, షేర్ హోల్డర్లలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇస్తుండటంతో పరిస్థితి మరింత జటిలం కానుంది. 

రెగ్యులేటరీ నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే పేటీఎంపై చర్యలకు ఉపక్రమించింది. డిపాజిట్లు స్వీకరించడం వంటివాటిపై నిషేధం విధించింది. ఈ పరిణామాలతో పేటీఎం యూజర్లలో ఆందోళన నెలకొంది. చాలామంది స్టార్టప్ కంపెనీ సీఈవోలు పేటీఎంపై చర్యల్ని ఖండించినా..కఠిన చర్యలు ఇంకా కొనసాగవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పేటీఎంపై ఆంక్షల ప్రభావం ఆ కంపెనీ షేర్లపై విపరీతంగా పడింది. కేవలం రెండ్రోజుల వ్యవధిలో పేటీఎం షేర్లు 40 శాతం క్షీణించాయి. రానున్న 3-4 రోజుల్లో పేటీఎం షేర్ విలువ మరింత తగ్గవచ్చని తెలుస్తోంది. పేటిఎం వ్యాపారాన్ని ఆకశ్మికంగా నిలిపివేయడం ఆ సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. 

మరోవైపు పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్‌లో నిధుల అవకతవకలు, మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయా లేవా అనేది దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపనుందని రెవిన్యూ కార్యదర్శి ప్రకటించడం ద్వారా పరిస్థితి మరింత జటిలం కానుందని తెలుస్తోంది. మనీ లాండరింగ్ ఆరోపణలుంటే ఈడీ దర్యాప్తు ఉంటుందని ఆయన చెప్పారు. ఇంకోవైపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ కూడా రద్దు చేసే పరిస్థితి కన్పిస్తోంది. ఈలోగా పేటీఎం డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడేందుకు ఆర్బీఐ తగిన చర్యలు తీసుకోనుంది. డిజిటల్ పేమెంట్స్ వ్యాలెట్ తిరిగి నింపకుండా కస్టమర్లను ఆపాల్సి ఉంటుంది. 

ఇప్పుడు ఈడీ కూడా రంగంలో దిగితే పేటీఏం పరిస్థితి, పేటీఎం యూజర్లు, పేటీఎం షేర్ హోల్డర్ల పరిస్థితి గందరగోళంగా మారవచ్చు. 

Also read: Paytm crisis: పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు, ఫాస్టాగ్ పనిచేస్తుందా లేదా, ఏం చేయాలి మరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More