Home> బిజినెస్
Advertisement

Best Selling Car: మన దేశంలో అమ్మకాల్లో దుమ్ములేపుతున్న కారు ఇదే.. ఎగబడి కొంటున్న జనం

Maruti Ertiga Price and Features: మారుతి ఎర్టిగా కారు అమ్మకాలలో దూసుకుపోతుంది. ఫ్రెండ్లీ బడ్జెట్‌తోపాటు అదిరిపోయే ఫీచర్లు, ఎక్కువ మైలేజీ ఇస్తుండడంతో ఈ కార్లను కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఫిబ్రవరి నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో ఒకటిగా మారుతి ఎర్టిగా నిలిచింది.   
 

Best Selling Car: మన దేశంలో అమ్మకాల్లో దుమ్ములేపుతున్న కారు ఇదే.. ఎగబడి కొంటున్న జనం

Maruti Ertiga Price and Features: ప్రస్తుతం కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కుటుంబం అంతా కూర్చొనే విధంగా లగ్జరీ కార్ల కోసం చూస్తున్నారు. ప్రస్తుతం వీటిలో మారుతి సుజుకి ఎర్టిగా 7 సీటర్ కారుకు ఫుల్ డిమాండ్ నెలకొంది. ఫిబ్రవరి నెలలో మన దేశంలో ఎక్కువగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఫ్రెండ్లీ బడ్జెట్, తక్కువ నిర్వహణ ఖర్చు, రన్నింగ్ కాస్ట్, మంచి మైలేజీ ఇస్తుండడంతో ఎక్కువ మంది ఈ కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారుఉ. దీంతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న MVP గా మారుతి ఎర్టిగా నిలిచింది. 

Also Read: Vladimir Putin: అణు యుద్ధానికి మేము సిద్ధం.. రష్యా అధ్యక్షుడు సంచలన ప్రకటన

ఈ కారు మొత్తం అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 140 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. మారుతీ సుజుకి ఎర్టిగా ఫిబ్రవరి నెలలో దేశంలోని మొత్తం కార్ల విక్రయాలలో ఆరో స్థానంలో నిలిచింది. గత నెలలో ఎర్టిగా 15,519 యూనిట్లు విక్రయించగా.. గతేడాది ఇదే నెలలో మొత్తం 6,472 కార్లను అమ్మింది. అంటే ఒక ఏడాదిలోనే అమ్మకాలు 140 శాతం పెరిగాయి. ఎర్టిగా ధర రూ.8.69 లక్షల నుంచి రూ.13.03 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

మారుతి ఎర్టిగా 7-సీటర్ కారులో 209 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. మూడో వరుస సీట్లను మడతపెడితే.. 550 లీటర్ల వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. 1.5-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కలిపి ఉంది. ఈ ఇంజిన్ పెట్రోల్‌పై 103PS/136.8Nm, సీఎన్‌జీపై 88PS/121.5Nm పవర్‌ను జనరేట్ చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మార్కెట్‌లో వస్తుంది. పెట్రోల్‌తో లీటరుకు 20.51 కిమీ వరకు, సీఎన్‌జిపై కిలోకు 26.11 కిమీ వరకు మైలేజీని ఇస్తోంది.

ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 7-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్లు, కనెక్ట్ అయిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆటో హెడ్‌ల్యాంప్‌లు, ఆటో ఏసీ, 4 ఎయిర్‌బ్యాగ్‌లు (టాప్ వేరియంట్‌లలో), EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్, బ్యాక్ సైడ్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి. అంతేకాకుండా సెన్సార్లతోపాటు ఇతర ఫీచర్లతో లభిస్తోంది. అందుకే ఈ కారుకు ప్రస్తుతం మార్కెట్‌లో భారీ డిమాండ్ నెలకొంది.

Also Read: IPL 2024 Updates: కప్ కొట్టాలనే కసితో ఆర్‌సీబీ.. కొత్త స్క్వాడ్ ఇదే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More