Home> బిజినెస్
Advertisement

Mahindra XUV400 EV: సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేసింది.. ఇక టాటా నెక్సాన్ ఈవీకి గుడ్ బై చెప్పాల్సిందే!

Mahindra XUV400 Electric SUV deliveries begin from Ugadi 2023. 'మహీంద్రా' ఈ సంవత్సరం జనవరిలో భారతీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసింది.
 

Mahindra XUV400 EV: సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేసింది.. ఇక టాటా నెక్సాన్ ఈవీకి గుడ్ బై చెప్పాల్సిందే!

Mahindra XUV400 Electric SUV Price and Range: ప్రముఖ కార్ల తయారీదారు 'మహీంద్రా' ఈ సంవత్సరం జనవరిలో భారతీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఆ కారే 'మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ' (Mahindra XUV400 EV). ఈ కారు డెలివరీలు గుడి పడ్వా (ఉగాది 2023) సందర్భంగా ప్రారంభమయ్యాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ యొక్క 400 యూనిట్లను మొదటి రోజునే కంపెనీ వినియోగదారులకు అందజేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV Prme), నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV MAX), ఎంజీ జెడ్‌ఎస్ ఈవీ (MG ZS EV) మరియు హ్యుందాయ్ కోనా (Hyundai KONA Electric) వంటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో పోటీ పడుతుంది. 

Mahindra XUV400 Electric Bookings: మహీంద్రా ఎక్స్‌యూవీ400 యొక్క టాప్-స్పెక్ EL వేరియంట్ యొక్క డెలివరీలు ముందుగా ప్రారంభమయ్యాయి. అయితే బేస్-స్పెక్ EC వేరియంట్ ఈ సంవత్సరం దీపావళి నాటికి అందుబాటులోకి వస్తుందని సమాచారం తెలుస్తోంది. ఎక్స్‌యూవీ400 కోసం మహీంద్రా ఇప్పటికే 10000 బుకింగ్‌లను కలిగి ఉంది. ఈ కారుపై ఏడు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. కొత్త ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మొదటి దశలో 34 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.

Mahindra XUV400 Electric Range: ఎక్స్‌యూవీ400 యొక్క EL వేరియంట్ 39.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది పూర్తి ఛార్జింగ్‌కు 456 కిమీ పరిధిని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఎక్స్‌యూవీ400 బేస్-స్పెక్ EC వేరియంట్ 34.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు పూర్తి ఛార్జ్‌పై 375 కిమీల పరిధిని అందజేస్తుందని మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొంది.

Mahindra XUV400 Electric Price: కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కారు 148bhp పవర్ మరియు 310Nm టార్క్ ఉత్పత్తి చేయగల సామర్ధ్యాన్ని (ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా) కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. మహీంద్రా ఎక్స్‌యూవీ400 మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ. 15.99 లక్షల నుంచి రూ. 18.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ధరలు మొదటి 5,000 మంది కొనుగోలుదారులకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

Also Read: Sanju Samson: భారత జట్టులోకి రావాలంటే.. సంజూ శాంసన్ ఇంకా ఏం చేయాలి! బీసీసీఐని ప్రశ్నించిన కాంగ్రెస్‌ ఎంపీ

Also Read: Black King Cobra Viral Video: ముగ్గురు స్నేక్ క్యాచర్‌లకు ఉచ్చ పోయించిన బ్లాక్ కింగ్ కోబ్రా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More