Home> బిజినెస్
Advertisement

Cash Transaction Rule: ఈ ఐదు ఆర్థిక లావాదేవీలు గుర్తుపెట్టుకోండి.. లేకపోతే కష్టాలే..

ITR Filing 2023: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే సమయంలో అన్ని విషయాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదో అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఏదైనా తేడా వస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావొచ్చు. అదేవిధంగా ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా పక్కగా ఉండాలి. 
 

Cash Transaction Rule: ఈ ఐదు ఆర్థిక లావాదేవీలు గుర్తుపెట్టుకోండి.. లేకపోతే కష్టాలే..

ITR Filing 2023: నగదు లావాదేవీల విషయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఎప్పటికప్పుడు ఓ కన్ను వేసి ఉంచుతోంది. గత కొన్నేళ్లుగా బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, బ్రోకర్ ప్లాట్‌ఫారమ్‌లు మొదలైన వివిధ పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌లు సాధారణ ప్రజల కోసం నగదు లావాదేవీల నిబంధనలను కఠినతరం చేశాయి. నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే నగదు లావాదేవీలను అనుమతిస్తాయి. చిన్న తప్పు జరిగినా.. ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందుకోవాల్సి రావొచ్చు. మీరు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్‌, బ్రోకరేజ్ హౌస్‌లు, ప్రాపర్టీ రిజిస్ట్రార్‌లతో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేస్తే.. ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే ఐదు ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకోండి.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ 

బ్యాంకు ఎఫ్‌డీలో నగదు డిపాజిట్ రూ.10 లక్షలకు మించకూడదు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో వ్యక్తిగత డిపాజిట్లు నిర్ణీత పరిమితిని మించిపోయాయా అనే విషయాన్ని బ్యాంకులు వెల్లడించాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తెలిపింది.

బ్యాంక్ సేవింగ్స్ ఖాతా డిపాజిట్

బ్యాంక్ ఖాతాలో నగదు డిపాజిట్ పరిమితి రూ.10 లక్షలు. ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాదారు రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే.. ఆదాయపు పన్ను శాఖ నోటీసును పంపవచ్చు. ఇంతలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల పరిమితిని దాటినా బ్యాంక్ ఖాతాలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు తప్పనిసరిగా ఐటీ అధికారులకు తెలియజేయాలి. కరెంట్ ఖాతాలలో పరిమితి రూ.50 లక్షల వరకు ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు

సీబీడీటీ నిబంధనల ప్రకారం.. క్రెడిట్ కార్డ్ బిల్లులకు బదులుగా రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ నగదు చెల్లింపులను ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలి. అదనంగా క్రెడిట్ కార్డ్ బిల్లులను సెటిల్ చేయడానికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించినట్లయితే.. ఆ చెల్లింపు ఐటీ శాఖకు తెలియజేయాలి.

రియల్ ఎస్టేట్ అమ్మకం లేదా కొనుగోలు

ఆస్తి రిజిస్ట్రార్ రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఏదైనా పెట్టుబడి లేదా స్థిరాస్తిని విక్రయించడాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులకు వెల్లడించాలి. ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకంలో పన్ను చెల్లింపుదారులు తమ నగదు లావాదేవీలను ఫారమ్ 26ASలో నివేదించాలి. ఆస్తి రిజిస్ట్రార్ కచ్చితంగా దాని గురించి నివేదిస్తారు.

షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లు, డిబెంచర్లు, బాండ్లలో పెట్టుబడి

మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లు, బాండ్‌లు లేదా డిబెంచర్‌లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు.. ఈ ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించి తమ నగదు లావాదేవీలు ఒక ఆర్థిక సంవత్సరంలో ₹10 లక్షలకు మించకుండా చూసుకోవాలి.

పన్ను చెల్లింపుదారుల అధిక విలువ నగదు లావాదేవీలను గుర్తించేందుకు ఆదాయపు పన్ను శాఖ ఆర్థిక లావాదేవీల వార్షిక సమాచార రిటర్న్ (ఏఐఆర్) ప్రకటనను సిద్ధం చేసింది. పన్ను అధికారులు దీని ఆధారంగా నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో అసాధారణంగా అధిక విలువ కలిగిన లావాదేవీల వివరాలను సేకరిస్తారు.

Also read: Bandi Sanjay: కవితమ్మా.. ముందు మీ అయ్యను నిలదీయ్.. వాళ్లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్  

Also read: Global Investors Summit 2023: ఏపీకి పెట్టుబడుల వరద.. భారీగా ఉద్యోగావకాశాలు: సీఎం జగన్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More