Home> బిజినెస్
Advertisement

IRCTC New Updates: రైలు రద్దయితే టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలా, రిఫండ్ ఎంతవస్తుంది

IRCTC New Updates: రైళ్లు రద్దైనప్పుడు టికెట్ పరిస్థితి ఏంటి, దానికదే క్యాన్సిల్ అవుతుందా, నిబంధనలేంటనే విషయంపై ఐఆర్సీటీసీ అప్‌డేట్స్ తెలుసుకుందాం..రిఫండ్ ఎలా వస్తుందనేది మరో ప్రశ్న.
 

IRCTC New Updates: రైలు రద్దయితే టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలా, రిఫండ్ ఎంతవస్తుంది

IRCTC New Updates: రైళ్లు రద్దైనప్పుడు టికెట్ పరిస్థితి ఏంటి, దానికదే క్యాన్సిల్ అవుతుందా, నిబంధనలేంటనే విషయంపై ఐఆర్సీటీసీ అప్‌డేట్స్ తెలుసుకుందాం..రిఫండ్ ఎలా వస్తుందనేది మరో ప్రశ్న.

ప్రతి వారం భారతీయ రైల్వే నిర్వహణ కారణాలతో లేదా వాతావరణం మూలంగా పలు రైళ్లు రద్దు చేస్తుంటుంది. ఇవాళ అంటే బుధవారం కూడా దేశవ్యాప్తంగా 100 రైళ్లు రద్దయ్యాయి. ఒకవేళ రైలు రద్దైతే..ఈ టికెట్ కూడా దానికదే రద్దవుతుంది. ఇందుకు సంబంధించిన మెస్సేజ్ కూడా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు చేరుతుంది. 

రైలు రద్దయినప్పుడు టికెట్ క్యాన్సిల్ చేయాలా

భారతీయ రైల్వేచే రైళ్లు రద్దయినప్పుడు పాసెంజర్లు టికెట్ క్యాన్సిల్ చేసుకోవల్సిన అవసరం లేదు. టికెట్ దానికదే రద్దవుతుంది. రిఫండ్ కూడా దానికదే వచ్చేస్తుంది. పాసెంజర్ల వైపు నుంచి ఏ విధమైన ప్రక్రియ అవసరం లేదు. అదే సమయంలో పాసెంజర్‌కు ఏ విధమైన ఫోన్‌కాల్స్ రావు. మీ క్రెడెన్షియల్స్ వివరాలు అడుగుతూ ఏమైనా ఫోన్‌కాల్స్ వచ్చాయంటే అవి ఫేక్ కాల్స్‌గా పరిగణించాలి. ఐఆర్సీటీసీ ఎప్పుడూ క్రెడెన్షియల్స్ అడగదు.

టికెట్ రద్దయితే..రిఫండ్ ఎంత వస్తుంది

పాసెంజర్ వైపు నుంచి టికెట్ రద్దయితే రిఫండ్ అనేది రైల్వే రూల్స్, టైమ్ లిమిట్ ప్రకారం వస్తుంది. అదే భారతీయ రైల్వే తరపున రైళ్లు రద్దయి టికెట్ రద్దైతే మాత్రం రిఫండ్ పూర్తిగా దానికదే సంబంధిత ఎక్కౌంట్‌లో జమవుతుంది. 

పాసెంజర్ టికెట్ రద్దు చేసుకుంటే..రైలు బయలుదేరే సమయానికి 48 గంటలకంటే ముందైతే ఏసీ ఫస్ట్‌క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాసెస్‌లో టికెట్‌కు 240 రూపాయలు, ఏసీ 2టైర్, ఫస్ట్‌క్లాస్ అయితే 200 రూపాయలు, ఏసీ 3 టైర్, ఛైర్‌కార్, ఏసీ 3 ఎకానమీ అయితే 120 రూపాయలు, స్లీపర్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ అయితే 60 రూపాయలు కట్ అవుతాయి. మిగిలిన డబ్బులు ఎక్కౌంట్‌కు బదిలీ అవుతాయి. 

అదే రైలు బయలుదేరే సమయానికి 12 నుంచి 48 గంటల్లోగా టికెట్ రద్దు చేసుకుంటే 25 శాతం నేరుగా కట్ అవుతుంది. అదే 4-12 గంటల్లోపు అయితే 50 శాతం వరకూ కట్ అవుతాయి. 

Also read: August Bank Holidays : కస్టమర్స్‌కు అలర్ట్... రేపటి నుంచి బ్యాంకులకు 4 వరుస సెలవులు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More