Home> బిజినెస్
Advertisement

IRCTC Thailand Tour: ఐఆర్‌సీటీసీ నుంచి థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజ్, 5 రాత్రులు, 6 రోజుల యాత్ర వివరాలు ఇలా

IRCTC Thailand Tour: కొత్త ఏడాది విదేశీ యాత్రకు వెళ్లాలనుకుంటే..ఇదే మంచి అవకాశం. ఐఆర్‌సీటీసీ బెస్ట్ టూర్ ప్యాకేజ్ ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజ్ వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు మీ కోసం..
 

IRCTC Thailand Tour: ఐఆర్‌సీటీసీ నుంచి థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజ్, 5 రాత్రులు, 6 రోజుల యాత్ర వివరాలు ఇలా

ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ మీ కోసం ఈసారి విదేశీ టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. చాలా తక్కువ ఖర్చుతో విదేశీ యాత్ర చేసి రావచ్చు. 5 రాత్రులు, 6 రోజుల అద్భుతమైన ప్యాకేజ్ ఇది. ఇందులో థాయ్‌లాండ్ తిరిగి రావచ్చు. స్టే నుంచి తిండి వరకూ అన్నీ అందులోనే..

ఐఆర్‌సిటీసీ థాయ్‌లాండ్ స్ప్రింగ్ ఫెస్టివల్ టూర్ పేరుతో ప్యాకేజ్ ప్రవేశపెట్టింది. ఈ పర్యటన జనవరి 21 నుంచి ప్రారంభమై..జనవరి 26 వరకూ ఉంటుంది. ఈ టూర్ కు బుక్ చేసుకునేవారు కోల్‌కతా నుంచి తమ ప్రయాణం ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజ్‌లో ముందుగా కోల్‌కతా నుంచి బ్యాంకాక్ చేరుకుంటారు. అక్కడి నుంచి పటాయా తీసుకువెళ్తారు. ఇందులో మంచి విషయమేమంటే స్టే నుంచి తిండి వరకూ అన్ని ఖర్చులూ ప్యాకేజ్‌లోనే ఉంటాయి.

ఈ ప్యాకేజ్‌లో స్టే ఏర్పాటు ఐఆర్‌సీటీసీ చేస్తుంది. ఇది కాకుండా హోటల్ నుంచి తిరగడానికి వెళ్లేందుకు వాహనం ఏర్పాటు ఉంటుంది. భోజనం, బ్రేక్‌ఫాస్ట్ కూడా ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్‌లోనే వర్తిస్తుంది. తిరిగేందుకు ఓ గైడ్ ఏర్పాటు కూడా ఉంటుంది. 

ప్యాకేజ్ ధర ఎంత

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం థాయ్‌లాండ్ వెళ్లేందుకు సింగిల్ అయితే ఒక్కొక్కరికి 54,350 రూపాయలు, డబుల్ అయితే ఒక్కొక్కరికి 46,100 రూపాయలుగా ఉంది. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్‌కు సంబంధించి ఇతర వివరాలు కూడా ఇదే సైట్‌లో ఉన్నాయి. 

Also read: Minimum Balance: ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఫరవాలేదు, జరిమానా పడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More