Home> బిజినెస్
Advertisement

Share Market: షేర్ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను ఎలా గుర్తించాలి, 7 సులభమైన టిప్స్

Share Market: షేర్ మార్కెట్‌లో కొన్ని షేర్లు అమాంతం లాభాలు ఆర్జిస్తుంటాయి. వీటినే మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. షేర్ మార్కెట్‌లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను చాలా సులభంగా గుర్తించవచ్చు. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం..

Share Market: షేర్ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను ఎలా గుర్తించాలి, 7 సులభమైన టిప్స్

షేర్ మార్కెట్‌లో చాలా షేర్లు అందుబాటులో ఉంటాయి. ఈ షేర్లతో కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు భారీగా డబ్బులు తెచ్చిపెడుతుంటాయి. కొన్ని షేర్లు ముంచేస్తుంటాయి. కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందిస్తుంటాయి. షేర్ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను గుర్తించేందుకు కొన్ని సులభమైన టిప్స్ ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

మైక్రోఎకనామిక్ సిట్యువేషన్ ఎనాలసిస్

జీడీపీ అభివృద్ధి, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు వంటి మైక్రోఎకానమక్ సిట్యువేషన్ విశ్లేషించి ప్రారంభించాలి. దీనివల్ల ఈ రంగాల్ని గుర్తించేందుకు దోహదమౌతుంది. సమీప భవిష్యత్తులో వేటి డిమాండ్ పెరుగుతందనేది తెలుసుకునేందుకు వీలవుతుంది. 

ఒకసారి సంబంధిత రంగాలు లేదా పరిశ్రమల్ని గుర్తిస్తే..వాటి పనితీరును కూడా విశ్లేషించుకోవాలి. సమీప భవిష్యత్తులో ఏ పరిశ్రమలు బాగుంటాయి..ఏవి బాగుండవనేది ఆలోచించుకోవాలి. 

అంతేకాకుండా ఇన్వెస్ట్ చేయబోయే కంపెనీ ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయాలి. ముఖ్యంగా ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్, స్టేట్‌మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ వంటివి పరిశీలించాలి. తక్కువ రుణాలు, ఎక్కువ నగదు ఫ్లో ఉండే కంపెనీల్ని గుర్తించాలి.

స్టాక్ మూల్యాంకనం మెట్రిక్స్ విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, ప్రైస్ టు బుక్ రేషియో, ప్రైస్ టు సేల్ రేషియో అధ్యయనం చేయాలి. 

అనుభవం, సామర్ధ్యం కలిగిన టీమ్స్ ఉన్న కంపెనీల్ని గుర్తించాలి. ఏ కంపెనీల ట్రాక్ రికార్డులో సక్సెస్ ఎక్కువగా ఉందో గుర్తించాలి. ఒకసారి అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ గుర్తించిన తరవాత కంపెనీ మూల సిద్ధాంతాలు, భవిష్యత్ సాధ్యాసాధ్యాల ఆధారంగా మూల్యం లక్ష్యం నిర్ధారించుకోవాలి. 

ఒకసారి స్టాక్‌లో పెట్టుబడి పెట్టిన తరువాత స్టాక్‌పై సునిశిత పరిశీలన అవసరం. అంచనాలకు తగ్గట్టుగా ఉందో లేదో పరిశీలించాలి. ఈ ఏడు టిప్స్ పాటించడం ద్వారా ఇన్వెస్టర్లు సులభంగా మల్టీబ్యాగర్ స్టాక్స్ ఏవనేది గుర్తించవచ్చు. భవిష్యత్ కోసం మంచి రిటర్న్స్ అందించవచ్చు.

Also read: Big Discount On iPhone: ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ. 25 వేల భారీ తగ్గింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More