Home> బిజినెస్
Advertisement

Indian Railways: ట్రైన్ వెయిటింగ్ లిస్ట్ ఎన్ని రకాలు, ఏది ముందుగా కన్ఫామ్ అవుతుంది

Indian Railways: రైల్వే ప్రయాణం చేసేవారికి తరచూ ఎదురయ్యే సమస్య రిజర్వేషన్. రద్దీగా ఉండే రోజుల్లో రిజర్వేషన్ లభించడం ఇబ్బందిగా మారుతుంటుంది. వెయిటింగ్ లిస్ట్ వచ్చిందంటే నిర్ధారణ అవుతుందా లేదా అనే ఆందోళన ఉంటుంది.
 

Indian Railways: ట్రైన్ వెయిటింగ్ లిస్ట్ ఎన్ని రకాలు, ఏది ముందుగా కన్ఫామ్ అవుతుంది

అసలు రైల్వే రిజర్వేషన్ ప్రక్రియలో వెయిటింగ్ లిస్ట్ అనేది ప్రధానమైన సమస్య. ఎక్కడికైనా అత్యవసరంగా వెళ్లాల్సివస్తే రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. అసలు కన్ఫామ్ అవుతుందో లేదే తెలియని పరిస్థితి. ఈ క్రమంలో వెయిటింగ్ లిస్ట్ ఎన్నిరకాలుంటుంది, ఏది ముందుగా కన్ఫామ్ అవుతుందో తెలుసుకుందాం..

భారతీయ రైల్వే అనేది దేశంలో అత్యధికులు వినియోగించే ప్రయాణ సాధనం. అత్యంత చౌకైన ప్రయాణం కూడా ఇదే. అందుకే రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీ నుంచి తప్పించుకోవాలంటే రైల్వే రిజర్వేషన్ సౌలభ్యముంటుంది. చాలా సందర్భాల్లో ఎక్కడికైనా అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు వెయిటింగ్ లిస్ట్ వస్తుంటుంది. ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే అది వెయిటింగ్ లిస్ట్ జాబితాలోవారికి సీరియల్ ప్రకారం వస్తుంది. దీనికోసం రైల్వే 7 రకాల వెయిటింగ్ లిస్ట్‌లు అందుబాటులో ఉంచుంది. వీటిలో ఏది ముందుగా కన్ఫామ్ అవుతుందనేది తెలుసుకుందాం.

RAC: రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్. ఇందులో ఒకటే సీటు ఇద్దరు ప్యాసెంజర్లకు కేటాయిస్తారు. కన్ఫామ్ టికెట్ ఏదైనా రద్దైతే ముందుగా ఆర్ఏసీ వెయిటింగ్ లిస్ట్ వారికే కన్ఫామ్ అవుతుంది. సీటు మొత్తం ఇచ్చేస్తారు. ఆర్ఏసీలో కన్ఫామ్ అవకాశాలు ఎక్కువే ఉంటాయి

RSWL: ఇది మరో రకం వెయిటింగ్ లిస్ట్. ఇది ట్రైన్ ప్రారంభమయ్యే స్టేషన్ నుంచి లభిస్తుంది. దీనిని రోడ్ సైడ్ వెయిటింగ్ లిస్ట్ అటారు. అంటే న్యూ ఢిల్లీ రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుంచి ప్రయాణం చేసేవారికి వెయిటింగ్ లిస్ట్ కేటాయిస్తారు. 

GNWL: ఇది జనరల్ వెయిటింగ్ లిస్ట్. ఇందులో ఎవరైనా కన్ఫామ్ టికెట్ ఉన్న ప్రయాణీకుడు టికెట్ క్యాన్సెల్ చేయిస్తే ఆ సీటు మీకు కేటాయిస్తారు. ఇది కూడా సీరియల్ ప్రకారమే జరుగుతుంది.

PQWL: పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్. ఈ వెయిటింగ్ లిస్ట్  జనరల్ జాబితా నుంచి ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో ప్రారంభ, ముగింపు స్టేషన్ల మధ్యన జర్ని చేసే ప్రయాణీకులుంటారు. 

NOSB: ఇది నో షార్ట్ బెర్త్. ఇది వెయిటింగ్ లిస్ట్ కానేకాదు. ఇది టికెట్‌లో ఓ రకం. ఇందులో 12 ఏళ్ల కంటే తక్కువ వయస్స పిల్లలకు సగం ధరకు టికెట్ ఇస్తారు. ఇందులో సీటు ఇవ్వరు.

RLWL: రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్. చిన్న స్టేషన్లకు రైళ్లో సీట్ కోటా ఉంటుంది. ఇది స్టేషన్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఉంటుంది. అక్కడి నుంచి ట్రైన్‌లో ఎక్కేందుకు ప్యాసెంజర్లు ఈ జాబితాలో ఉంటారు. ఇది కన్ఫామ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.

TQWL: తత్కాల్‌లో టికెట్ బుక్ చేసిన తరువాత కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది ఒక్కోసారి. దీనినే తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ అటారు. ఈ టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ.

Also read: PF Transfer: ఈపీఎఫ్ఓ అప్‌డేట్, పాత కంపెనీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను కొత్త కంపెనీకు ఎలా మార్చడం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More