Home> బిజినెస్
Advertisement

Cash Transactions: నగదు లావాదేవీలపై కొత్త పరిమితులు, దాటితే...ఫైన్ తప్పదిక

Cash Transactions: ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలే ఎక్కడ చూసినా ఎక్కువగా కన్పిస్తున్నాయి. పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే..ఇలా ప్రతిచోటా ఇవే దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో నగదు లావాదేవీలపై ప్రభుత్వం మరిన్ని నిబంధనలు విధించింది. అవేంటో చూద్దాం..
 

Cash Transactions: నగదు లావాదేవీలపై కొత్త పరిమితులు, దాటితే...ఫైన్ తప్పదిక

Cash Transactions: ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలే ఎక్కడ చూసినా ఎక్కువగా కన్పిస్తున్నాయి. పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే..ఇలా ప్రతిచోటా ఇవే దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో నగదు లావాదేవీలపై ప్రభుత్వం మరిన్ని నిబంధనలు విధించింది. అవేంటో చూద్దాం..

ఇండియాలో డిజిటల్ ట్రాన్‌జాక్షన్స్ గత కొద్దికాలంగా భారీగా పెరిగాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రభుత్వం తీసుకునే చర్యల కంటే..కరోనా మహమ్మారి తీసుకొచ్చిన భయం వల్ల ప్రజానీకం డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్ కూడా మరో ప్రధాన కారణం. కారణాలు ఏమైనా...దేశంలో డిజిటల్ లావాదేవీలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరింతగా పెంచేందుకు ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు కొత్తగా నగదు లావాదేవీలపై కొత్త పరిమితులు విధించింది. ఈ పరిమితి దాటితే మీరింక జరిమానా చెల్లించాల్సిందే..

ఇందులో భాగంగా ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిప్రకారం రోజుకు మీ నగదు లావాదేవీలు 2 లక్షలు మించకూడదు. ఎక్కడ ఏది కొనుగోలు చేసినా 2 లక్షలు దాటితే క్రెడిట్, డెబిట్, చెక్, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. 2 లక్షల్లోపైతే నగదు చెల్లించుకోవచ్చు. ఈ నిబంధన కేవలం కొనుగోళ్లకే కాదు..కుటుంబసభ్యుల్నించి డబ్బులు తీసుకున్నా వర్తిస్తుంది. నగదు లావాదేవీల్ని పరిమితం చేసేందుకు ప్రభుత్వం సెక్షన్ 269 ఎస్‌టిలో మార్పులు చేసింది. ఈ మార్పుల ప్రకారం రోజుకు 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు నిషేధం.

ఇక లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బుల్ని ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే మంచిది. నగదు రూపంలో చెల్లిస్తే సెక్షన్ 80 డి కింద పన్ను మినహాయింపును కోల్పోతారు. మరోవైపు వ్యక్తులు లేదగా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ నుంచి రుణాలు తీసుకునేటప్పుడు కూడా 20 వేలు మించితే...ఆన్‌లైన్ తప్పదు. ఇక నగదును బహుమతిగా తీసుకునేటప్పుడు కూడా పరిమితులున్నాయి. ఇది కూడా 2 లక్షలు మించకూడదు. లేకపోతే ఫైన్ తప్పదు. ఫైన్ ఎలా ఉంటుందంటే.ఎంత బహుమతి ఇస్తారో అంతే ఉంటుంది. 

Also read: ITR New Rules: మీరు ట్యాక్స్ పేయరా..కొత్త నిబంధనలొచ్చేశాయి, తెలుసుకోండి..ఇక వారికి కూడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More