Home> బిజినెస్
Advertisement

ITR Filing Benefits: ఐటీ రిటర్న్స్‌తో 5 కీలకమైన ప్రయోజనాలు ఇవే

ITR Filing Benefits: ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు అందరూ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌లో బిజీగా ఉన్నారు. అసలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా, కేవలం ట్యాక్స్ పేయర్లే రిటర్న్స్ దాఖలు చేయాలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ITR Filing Benefits: ఐటీ రిటర్న్స్‌తో 5 కీలకమైన ప్రయోజనాలు ఇవే

ITR Filing Benefits: ఈ ఆర్ధిక సంవత్సరం 2023-24 ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు తేదీ జూలై 31. ఆ తరువాత మరో ఐదు నెలలు అంటే డిసెంబర్ వరకూ జరిమానాతో ఫైల్ చేయవచ్చు. ఐటీ రిటర్న్స్ అనేది కేవలం ట్యాక్స్ పేయర్లకే కాదు..ట్యాక్స్ పరిధిలో రానివాళ్లు కూడా ఫైల్ చేయవచ్చని, దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

చాలామంది ట్యాక్స్ పరిధిలో వస్తేనే ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుందని అనుకుంటారు. అంటే ఏడాది ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువ ఉన్నవాళ్లు రిటర్న్స్  అవసరం లేదనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. అలాగని ట్యాక్స్ పరిధిలో రానివాళ్లకు రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి కూడా కాదు. మీరు ఒకవేళ ఐటీ పరిధిలో లేకున్నా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఎందుకంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా రిటర్న్స్ ఫైల్ చేసేవారికి లోన్ సులభంగా లభిస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు ఇది అవసరమౌతుంది. ఐటీ రిటర్న్స్ పైల్ చేయడం వల్ల 5 ప్రయోజనాలున్నాయి. 

అడ్రస్ ప్రూఫ్‌గా...

ఐటీ రిటర్న్స్ రిసీప్ట్ అనేది రిజిస్టర్డ్ చిరునామాకు ఇన్‌కంటాక్స్ శాఖ పంపిస్తుంది. ఇది అడ్రస్ ప్రూఫ్‌లా పనిచేస్తుంది. 

నష్టాలు చూపించుకునేందుకు...

షేర్ మార్కెట్ లేదా మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి నష్టం వస్తే ఆ నష్టాన్ని మరుసటి ఏడాదికి చూపించుకునేందుకు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పనిచేస్తుంది. ఎందుకంటే వచ్చే ఏడాది ఒకవేళ లాభాలొస్తే గత ఏడాది నష్టంలో అడ్జస్ట్ చేయవచ్చు దాంతో ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు.

లోన్ సులభతరం..

ఐటీ రిటర్న్స్ అనేది మీ ఆదాయానికి ఓ ప్రూఫ్. అన్ని బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలు స్వీకరిస్తాయి. బ్యాంకు లోను కోసం అప్లై చేసినప్పుడు అందుకే బ్యాంకర్లు ఐటీ రిటర్న్స్ అడుగుతుంటారు. ఎప్పటికప్పుడు నిర్ణీత సమయంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే బ్యాంకులు సులభంగా లోన్ మంజూరు చేస్తాయి. 

ట్యాక్స్ రిఫండ్ క్లెయిమింగ్ ...

ఆదాయం కంటే ఎక్కువ టీడీఎస్ కట్ అయితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఆదాయాలపై ట్యాక్స్ ఉండదు. 

వీసా కోసం..

విదేశాలకు వెళ్లాలంటే వీసా కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పడు కచ్చితంగా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. చాలా దేసాలు వీసా కోసం 3-5 ఏళ్ల ఐటీ రిటర్న్స్ అడుగుతుంటాయి. తమ దేశంలోకి వచ్చే వ్యక్తి ఆదాయం, ఆర్ధిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఐటీ రిటర్న్స్ ఉపయోగపడతాయి.

Also read: Redmi Note 15 Pro: 200MP కెమేరా 8000mAh బ్యాటరీతో రెడ్‌మి నుంచి మరో ఫోన్, ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More