Home> బిజినెస్
Advertisement

Refund Scam: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్..ఈ SMS వచ్చిందా? క్లిక్ చేశారంటే మీ డబ్బులు గోవిందా..!!

Refund Scam:పన్ను చెల్లింపు దారులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇటీవల ఐటిఆర్ దాఖలు చేసిన వారికి పన్ను రిఫండ్ పేరిట ఫేక్ మెసేజెస్ వస్తున్నాయి. ఈ మెసేజెస్ క్లిక్ చేసిన పనులు చెల్లింపు దారులు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Refund Scam: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్..ఈ SMS వచ్చిందా? క్లిక్ చేశారంటే మీ డబ్బులు గోవిందా..!!

ITR Refund Scam: ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేసేందుకు చివరి తేదీ ముగిసిపోయింది. ఇప్పుడు ఇక రీఫండ్స్ కోసం పన్ను చెల్లింపుదారులు ఎదురుచూస్తున్నారు. ఎవరైతే అదనంగా పన్ను చెల్లించారో వారికి రీఫండ్  రూపంలో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు ఆయా పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాలో రీఫండ్  మొత్తాన్ని జమ చేస్తారు. అలాగే ఎవరైతే టీడీఎస్ రూపంలో ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారో వారు టీడీఎస్ ను క్లెయిం చేసుకునేందుకు కూడా ఐటిఆర్ రిటర్న్స్ ఉపయోగపడతాయి.ఐటిఆర్ రిటర్న్ దాఖలు చేసిన అనంతరం 45 రోజుల లోపు మీ రీఫండ్  మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే మీరు ఐటిఆర్ దాఖలు చేసేటప్పుడు బ్యాంకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా అందించాల్సి ఉంటుంది. లేకపోతే మీకు రీఫండ్ పొందడం కష్టం అవుతుంది.  ఇదిలా ఉంటే ఆదాయ పన్ను శాఖ ఐటిఆర్ దాఖలు చేసిన అనంతరం  పూర్తిస్థాయిలో లెక్కలన్నింటిని మదింపు చేసి మీకు రావాల్సిన రీఫండ్ లను మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభిస్తుంది. 

Also Read:Mukesh Ambani: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ వాడుతున్నఫోన్ ధర తెలిస్తే..ఆశ్చర్యపోతారు..!!

అయితే దీన్నే అవకాశంగా తీసుకొని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా ఎవరైతే పన్ను చెల్లింపుదారులు ఉన్నారో వారికి ఫేక్ మెసేజెస్ పంపుతూ బోల్తా కొట్టించే పని చేస్తున్నారు. ఈ ఫేక్ మెసేజెస్ ఎవరైతే నమ్మి ఆ మెసేజ్ లో ఉన్న విధంగా. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేస్తే మీ డబ్బు ఈ కేటుగాళ్ల పాలవుతుందన్న సంగతి గుర్తుంచుకుంటే మంచిది.తాజాగా ఆదాయ పన్ను శాఖ వారు సైతం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తమ పన్ను చెల్లింపు దారులతో పంచుకున్నారు. ముఖ్యంగా ఫేక్ మెసేజెస్ ద్వారా సైబర్ నేరగాళ్లు పన్ను చెల్లింపుధారులను మోసం చేస్తున్నారని ముఖ్యంగా కొన్ని యుఆర్ఎల్ లింకులను పంపి వాటిని క్లిక్ చేసి మీ బ్యాంకు ఖాతా నెంబర్ ఎంటర్ చేయమని తద్వారా మీకు రీఫండ్  అందిస్తామని బోల్తా కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read:ICICI FD Rate Hike: గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్..1 లక్ష ఎఫ్‌డీపై ఎంత వడ్డీ అంటే..?

నిజానికి మీరు ఐటిఆర్ దాఖలు చేసే సమయంలోనే ఒకటికి రెండుసార్లు బ్యాంకు ఎకౌంటును తనిఖీ చేసుకోమని వెబ్ సైట్ లో ఐటీ శాఖ వారు హెచ్చరిస్తారు. ఒకవేళ మీ బ్యాంకు ఎకౌంటు సక్రియంగా లేకపోతే మీ రీఫండ్ డబ్బులు అకౌంట్ లో పడవు అన్న సంగతి పలుమార్లు గుర్తుచేస్తుంది. ఆ తర్వాత మాత్రమే మీరు ఐటిఆర్ దాఖలు చేసేందుకు అనుమతి ఇస్తుంది. అంతేకానీ మీకు నేరుగా ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ చేసి కానీ బ్యాంకు ఎకౌంటు నెంబరు అడగటం ఇతర వివరాలను అడగటం ఆదాయపన్ను శాఖ వారు చేయరు అని ఉన్నతాధికారులు తెలిపారు.ఇలాంటి ఫేక్ మెసేజెస్ వచ్చినట్లయితే వెంటనే వాటికి స్పందించకుండా ఉంటే మంచిదని తెలిపారు.  ఆదాయపన్ను శాఖ వారు ఎలాంటి సంప్రదింపులు జరపరని ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి గ్రీవెన్స్ ద్వారా సంప్రదించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More