Home> బిజినెస్
Advertisement

Hyundai Venue @ Rs 7.7 Lakhs: Hyundai Venue కొత్త వేరియంట్.. కేవలం రూ. 7.7 లక్షలు మాత్రమే!

Buy Hyundai Venue @ Rs 7.7 Lakhs: ఇండియాలో మారుతి తరువాత ఎక్కువ ఆదరణ ఉన్న కార్ల కంపెనీ హ్యుండయ్ అంటే అతిశయోక్తి అవసరం లేదు. ముఖ్యంగా హ్యుండయ్ క్రెటా ఇండియాలో చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు హ్యుండయ్ మరో వేరియంట్ లాంచ్ చేసింది. ఆ వివరాలు మీ కోసం..

Hyundai Venue @ Rs 7.7 Lakhs: Hyundai Venue కొత్త వేరియంట్.. కేవలం రూ. 7.7 లక్షలు మాత్రమే!

Get Hyundai Venue @ Rs 7.7 Lakhs: దక్షిణ కొరియా కార్ల కంపెనీ హ్యుండయ్ మోడల్ కార్లకు ఇండియాలో మంచి క్రేజ్. హ్యుండయ్ శాంత్రాతో  దేశంలో అడుగెట్టిన కంపెనీ ఐ10, ఐ20లో క్రేజ్ పెంచుకుంది. ఆ తరువాత ఎస్‌యూవీ వెర్షన్‌లో హ్యుండయ్ క్రెటాకు తిరుగేలేని ఆధిక్యాన్ని సాధించింది. 

మార్కెట్‌లో పెరుగుతున్న పోటీకు అనుగుణంగా హ్యుండయ్ కంపెనీ ఇప్పటి వరకూ ఉన్న మోడల్స్‌ను అప్‌‌డేట్ చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా హ్యుండయ్ వెన్యూని అప్‌డేట్ చేసింది. హ్యుండయ్ వెన్యూ బేసిక్ మోడల్ ఈ ని అప్‌డేట్ చేసి హ్యుండయ్ వెన్యూ ఓగా కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. Hyundai Venue E(O)పేరుతో మార్కెట్‌లో ప్రవేశపెట్టిన వెన్యూలో మూడు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. E(O)ను హ్యుండయ్ కంపెనీ ఇప్పుడు కొత్త బేసిక్ మోడల్‌గా చేసింది. ఈ కారు ధర 7.76 లక్షల రూపాయల్నించి ప్రారంభమౌతుంది.  అదే వెన్యూ ఇ ధర 7.71 లక్షల రూపాయలుండేది. 

హ్యుండయ్ వెన్యూ అప్‌డేటెడ్ వెర్షన్ ఇ ఓ వీడియో ఇటీవల బయటికొచ్చింది ఈ వీడియో ప్రకారం ఈ మోడల్ పూర్తిగా డిజటల్ ఇన్‌స్ట్రుమెంట్ గేజ్ క్లస్టర్, 60/40 రేర్ స్ప్లిట్ సీట్లతో పాటు హెడ్ రెస్ట్ అందరికీ కల్పించింది. ఇందులో కంపెనీ కొత్తగా 3  అదనపు సేఫ్టీ ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఇందులో మొదటిది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రెండవది వెహికల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్ , మూడవది హిల్ అసిస్ట్ కంట్రోల్. కచ్చితంగా మూడు సేఫ్టీ ఫీచర్లు కస్టమర్లకు ఉపయోగపడేవే కావడం విశేషం. ఈ మూడు ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం..

Also Read: 7th Pay Commission updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నుంచి మరో 4 శాతం పెరగనున్న డీఏ

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది వాహనాన్ని అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తుంది. సెన్సార్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. డ్రైవర్ ఏ దిశలో వెళ్లాలనుకుంటున్నాడు, వాహనం ఏ దిశలో ఉంది అనేది సెన్సార్ ఆధారంగా పసిగడుతుంది. ఒకవేళ కారు అదుపు తప్పుతుంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ బ్రేక్ వేస్తుంది. స్టెబిలిటీ కోసం ఇంజన్ పవర్‌ను ఎడ్జస్ట్ చేస్తుంది. ఓవర్ స్టీరింగ్ వల్ల జరిగే ప్రమాదాల్ని నియంత్రిస్తుంది. 

హిల్ అసిస్టెంట్ కంట్రోల్

హిల్ అసిస్టెంట్ కంట్రోల్ అనేది ఎత్తులో ఉండే కారుని స్టార్ట్ చేయడం, కిందకు దొర్లకుండ నియంత్రించడంలో సహాయపడుతుంది. డ్రైవర్ బ్రేక్ పెడల్ రిలీజ్ చేయగానే హిల్ అసిస్ట్ కంట్రోల్ అనేది కొద్దిసేపు బ్రేక్‌ను అలాగే పట్టి ఉంచుతుంది. వాహనం వెనక్కి దొర్లకుండా నియంత్రిస్తుంది. హిల్ స్టార్ట్ చేసేటప్పుడు డ్రైవింగ్ చేసే వ్యక్తికి విశ్వాసాన్ని, ధైర్యాన్ని అందిస్తుంది ఈ ఫీచర్. 

వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్

వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ అనేది ఒక అడ్వాన్స్ సేఫ్టీ వ్యవస్థ. ఈ ఫీచర్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్‌తో కలిసి పనిచేస్తుంది. స్టీరింగ్ యాంగిల్, స్పీడ్, బ్రేకింగ్ వంటి వెహికల్ డైనమిక్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. కారు అదుపు తప్పుతోందని గమనించగానే సెలెక్టివ్ బ్రేకింగ్ సహాయంతో ఇంజన్ టార్క్ అడ్జస్ట్ చేస్తుంది. డ్రైవర్ కారుపై అదుపు సాధించేందుకు దోహదం చేస్తుంది. 

హ్యుండయ్ వెన్యూ బేసిక్ మోడల్ కు చేర్చిన ఈ మూడు సేఫ్టీ ఫీచర్లతో వెన్యూ క్రేజ్ మరింతగా పెరిగింది. అదే సమయంలో మూడు ఫీచర్లు కూడా అద్భుతంగా ఉపయోగపడే ఫీచర్లు కావడంతో అందరికీ ఆసక్తి పెరుగుతోంది. 

Also Read: EPFO Latest Updates: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. మరో 10 రోజులే సమయం ఉంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More