Home> బిజినెస్
Advertisement

hyundai Creta facelift: పిచ్చెక్కించే ఫీచర్స్‌లతో హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ..కేవలం రూ.25,000 చెల్లిస్తే కారు మీ సొంతం..

New Hyundai Creta 2024: ప్రముఖ ఆటో కంపెనీ హ్యుందాయ్‌ తన క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ సంబంధించిన ప్రీ బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ జనవరి 16న ఈ కారును అధికారికంగా లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ 2024 అప్‌డేట్‌ హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ కార్ల బుకింగ్‌ కోసం రూ.25,000 టోకెన్  చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ ఇప్పటికే ఈ కార్లకు సంబంధించి కొన్ని ఫీచర్స్‌ను అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు వేరియంట్స్‌ల వివరాలను కూడా వెల్లడించింది. అయితే ఈ కార్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

hyundai Creta facelift: పిచ్చెక్కించే ఫీచర్స్‌లతో హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ..కేవలం రూ.25,000 చెల్లిస్తే కారు మీ సొంతం..

New Hyundai Creta 2024: హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌లు ఇవే:

మార్కెట్‌లో అతి త్వరలోనే విడుదల కాబోయే క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ మొత్తం ఏడు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో E, Ex, S, S(O), Sx, Sx Tech,  Sx(O) వేరియంట్‌లుగా  మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నాయి. ఇందులోని మొదిటి వేరియంట్‌ డ్యూయల్‌-టోన్‌ కలర్‌ ఆప్షన్‌లో విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమైంది.

ఇంజన్ వివరాలు:

రాబోయే 2024 హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో పాటు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ , 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో మార్కెట్‌లోకి రాబోతున్నాయి. అయితే ఈ 1.5L పెట్రోల్ ఇంజన్‌ కేవలం Mt వేరియంట్‌లలోనే లభించబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు 1.5L డీజిల్‌ ఇంజన్‌ కూడా కేవలం Mt, Sx ట్రిమ్‌లో తప్ప అన్ని వేరియంట్స్‌లో రాబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ 1.5L పెట్రోల్ Cvt S(O), Sx Tech, Sx(O) వెరియంట్‌లో రాబోతున్నట్లు సమాచారం. అయితే 1.5L డీజిల్ ఇంజన్‌ కేవలం At S(O),  Sx(O) వేరియంట్స్‌లో లభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ 1.5L టర్బో పెట్రోల్ ఇంజన్‌  టాప్-స్పెక్ Sx(O) వేరియంట్‌లో మాత్రమే లభించనుంది. 

Also read: Top EV Cars in 2023: బడ్జెట్, లగ్జరీ విభాగాల్లో టాప్ 7 ఈవీ కార్లు, వాటి ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More