Home> బిజినెస్
Advertisement

How to Pay Credit Card Bills: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతున్నారా ? ఇలా చేయండి

How to Pay Credit Card Debts: ఒక్కసారి క్రెడిట్ కార్డు అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాకా.. అది ఎంత త్వరగా చెల్లిస్తే అంత నయం. అలా కాకుండా ఆలస్యం చేసే కొద్దీ ఆ ఊబిలో మరింత ఇరుక్కుపోతుంటాం కానీ అందులోంచి బయటికి రాలేం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి ? ఎలా ఈ క్రెడిట్ కార్డ్స్ అప్పుల ఊబిలోంచి బయటికి రావాలి ? అనేదే ఇప్పుడు తెలుసుకుందాం.

How to Pay Credit Card Bills: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతున్నారా ? ఇలా చేయండి

How to Pay Credit Card Debts: క్రెడిట్ కార్డులు.. ఎవరికైనా సరే అత్యవసరంలో వారి వద్ద డబ్బులు ఉన్నా లేకున్నా.. క్రెడిట్ కార్డులు ఉంటే చాలు వారి అవసరం గట్టెక్కిపోతుంది. అందుకే ఒకప్పటితో పోలిస్తే.. ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డ్స్ వినియోగం కూడా చాలా పెరిగిపోయింది. ఐతే అత్యవసరంలోక్రెడిట్ కార్డ్స్ ఉపయోగించినంత వరకు పర్వాలేదు కానీ ఆ తరువాత సకాలంలో క్రెడిట్ కార్డ్స్ బిల్లు చెల్లించకపోతేనే అసలు సమస్య తలెత్తుతుంది. ఎంత ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లు ఉండి.. వారి వద్ద ఎంత తక్కువ ఆదాయం ఉంటే.. అంత ఎక్కువ ఇబ్బంది తలెత్తుతుంది. ఎందుకంటే సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించని వారికి ఆర్ధిక భారం తడిసి మోపెడవుతుంది. ఆలస్య రుసుం, అధిక వడ్డీల రూపంలో బ్యాంకులు భారీ మొత్తాన్ని ముక్కు పిండి మరీ చార్జీలు వసూలు చేస్తాయి. ఇది ఊరికే చెప్పడం లేదు. ఇలాంటి చేదు అనుభవం ఎదురైన వారు చాలామందే ఉంటారు. 

ఒక్కసారి క్రెడిట్ కార్డు అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాకా.. అది ఎంత త్వరగా చెల్లిస్తే అంత నయం. అలా కాకుండా ఆలస్యం చేసే కొద్దీ ఆ ఊబిలో మరింత ఇరుక్కుపోతుంటాం కానీ అందులోంచి బయటికి రాలేం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి ? ఎలా ఈ క్రెడిట్ కార్డ్స్ అప్పుల ఊబిలోంచి బయటికి రావాలి ? అనేదే ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మీకున్న అప్పులు అన్నీ ఒక్క చోట రాసిపెట్టుకోండి. అందులోంచి ఎవరికి లేదా ఏ క్రెడిట్ కార్డుకు ముందు డ్యూ డేట్స్ ఉన్నాయి అనేది కూడా వరుస క్రమంలో రాసిపెట్టుకోండి. అందులోంచి ముందు డ్యూ డేట్ ఉన్న వారికి ముందుగా చెల్లిస్తూ మీ వద్ద ఉన్న మిగతా మొత్తంతో మీ అవసరాలు వెళ్లదీసుకుంటూ రండి. అదే సమయంలో మీ అప్పులు అన్నీ తీరే వరకు అనవసర ఖర్చులు అన్నీ తగ్గించుకోండి. అనవసరంగా ఖర్చు చేయకపోవడం కూడా ఒక ఆదాయంతో సమానమే అవుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు.

చాలామంది క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ తమ వద్ద డబ్బులు లేకపోవడం వల్ల క్రెడిట్ కార్డ్స్ బిల్లు మొత్తాన్ని చెల్లించకుండా కేవలం మినిమం డ్యూ మాత్రమే చెల్లిస్తూ అసలును వాయిదా వేస్తూ వస్తుంటారు. కానీ అసలు మొత్తాన్ని చెల్లించనంతవరకు కొన్ని బ్యాంకులు మీ ఔట్‌స్టాండింగ్ ఎంత ఉందనే మొత్తాన్నిబట్టి కొంతమొత్తాన్ని లేట్ ఫీ కింద చార్జ్ చేస్తుంటాయి. ఈ లేట్ ఫీ కూడా మీ క్రెడిట్ కార్డు బిల్లులో యాడ్ చేస్తుంటాయి. అలా ప్రతీ నెల లేట్ ఫీ యాడ్ చేయడం, అలా వచ్చిన మొత్తం ఔట్‌స్టాండింగ్‌పై వడ్డీ జోడించడం చేస్తుంటాయి. అంటే నెల నెలా మీ క్రెడిట్ కార్డు మినిమం బిల్లు చెల్లించినప్పటికీ.. అసలు బిల్లులో ఏ మాత్రం తగ్గకపోగా.. మీరు మీ క్రెడిట్ కార్డుపై కొత్తగా లావాదేవీలు చేయనప్పటికీ.. ప్రతీ నెల జోడించే లేట్ ఫీని, దానిపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీని చెల్లిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. 

అనవసర ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఓవైపు క్రెడిట్ కార్డు బిల్లు పెండింగ్‌లో ఉండగానే మరోసారి చేసే అనవసర ఖర్చులు మీపై ఆర్థిక భారాన్ని రెట్టింపు చేస్తాయి కానీ తగ్గించవు. అందుకే దుబారా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. 

ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ బిల్లులు మరీ అధికంగా ఉండి ఒకేసారి ఆ బిల్లును చెల్లించే పరిస్థితి లేనట్టయితే.. మీరు మీకు క్రెడిట్ కార్డు మంజూరు చేసిన బ్యాంకు పోర్టల్‌లోకి లాగిన్ అవడం ద్వారా కానీ లేదా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్స్‌ని సంప్రదించడం ద్వారా మీ మొత్తం బిల్లును ఇఎంఐ పద్ధతిలోకి మార్చుకునేందుకు వీలు ఉంటుంది. అందుకోసం కొంతమొత్తాన్ని చార్జి కింద వసూలు చేస్తారు. అయినప్పటికీ.. ఇఎంఐ పద్ధతి మీ క్రెడిట్ హిస్టరీ పాడవకుండా కాపాడుతుంది.

ఇది కూడా చదవండి : Housing Loan NOC: హోమ్ లోన్ తిరిగి చెల్లించడంతోనే పని అయిపోదు

పర్సనల్ లోన్ తీసుకుని క్రెడిట్ కార్డ్స్ బిల్లులు చెల్లించడం అనేది మీ ముందున్న మరో పద్ధతి. క్రెడిట్ కార్డ్స్ బిల్లులు అధికంగా ఉండి మీ వద్ద మరో ఆప్షన్ లేనట్టయితే.. పర్సనల్ లోన్ తీసుకుని క్రెడిట్ కార్డ్స్ బిల్లులు చెల్లించడం ఉత్తమం. మీరు తీసుకున్న రుణంతో మీ క్రెడిట్ కార్డ్స్ బిల్లులు చెల్లించి.. అలాగే సకాలంలో పర్సనల్ లోన్ ఇఎంఐ కూడా చెల్లించినట్టయితే.. మీ సిబిల్ స్కోర్ కూడా మెరుగు అవుతుంది.

ఇది కూడా చదవండి : Top Electric Cars in India: ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More