SBI e-auction, Low price property deals | మీరు తక్కువ ధరలో ఏదైనా ఆస్తిని కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా తక్కువ ధరకు ఇల్లు లేదా దుకాణం లేక మరేదైనా ఫ్యాక్టరీ లాంటి ప్రాపర్టీని సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారా ? మరి తక్కువ ధరకే ఇల్లు, దుకాణం లేదా ఫ్యాక్టరీ లాంటి ఆస్తులు ఎక్కడ లభిస్తాయనే కదా మీ సందేహం! అయితే మీ సందేహానికి సమాధానం ఇదిగో.. ఎస్బిఐ ఇ-వేలం. మరింత తెలుసుకోవడానికి ఈ వివరాలు చదవండి!
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) తక్కువ రేటుకే ఆస్తిని సొంతం చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. కానీ ఈ అవకాశం 2020 డిసెంబర్ 30 వరకు మాత్రమే లభిస్తుంది. ఈ ఆఫర్‌పై ఆసక్తి ఉన్న వారందరూ ఎస్బీఐ నిర్వహించే ఇ వేలం ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.
తమ బ్యాంకు నుండి రుణం తీసుకుని, ఆ రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన ( Failure in repayment of loans ) వారి ఆస్తులను ఇ వేలం ద్వారా విక్రయించనున్నట్టు ఎస్బీఐ ట్విటర్ ద్వారా ప్రకటించింది.
Also read : SBI Cuts Interest Rates: ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ లోన్స్‌పై భారీగా తగ్గిన వడ్డీ రేట్లు
Also read : PM KISAN scheme: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధి డబ్బులు ఎప్పుడు పడతాయి ?
మరి ఇంకా ఎందుకు ఆలస్యం.. తక్కువ ధరలకే ప్రాపర్టీని కొనుగోలు చేసే అవకాశాన్ని మీరూ సద్వినియోగం చేసుకోండి. ఏదైనా ఆస్తులను కొనుగోలు చేయడం ద్వారా డబ్బును పెట్టుబడిగా ( Investments on properties ) పెట్టాలనుకునేవారికి ఇదే సరైన సమయం.
Also read : Jio vs Vodafone, idea, Airtel: ఇంటర్నెట్ స్పీడ్‌లో ఏది ఎక్కువ ? ఏది తక్కువ తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook