Home> బిజినెస్
Advertisement

Pradhan Mantri Ujjwala Yojana 2.0: అదిరిపోయే స్కీమ్.. ఫ్రీగా రెండు గ్యాస్ సిలిండర్లు.. ఇలా అప్లై చేసుకోండి

PM Ujjwala Yojana 2.0 Online Apply: పీఎం ఉజ్వల యోజన 2.0 కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తోంది. ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభమైంది. హోలీ సందర్భంగా ఈ నెలలో ఒక గ్యాస్ సిలిండర్‌ను అందజేయనుంది. పూర్తి వివరాలు ఇలా.. 

Pradhan Mantri Ujjwala Yojana 2.0: అదిరిపోయే స్కీమ్.. ఫ్రీగా రెండు గ్యాస్ సిలిండర్లు.. ఇలా అప్లై చేసుకోండి

PM Ujjwala Yojana 2.0 Online Apply: మహిళలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 స్కీమ్‌ కింద రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడంతోపాటు గ్యాస్ స్టవ్‌ను కేంద్రం ఫ్రీగా ఇస్తోంది. ఈ స్కీమ్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలి..? ఆన్‌లైన్‌ ఎలా అప్లై చేసుకోవాలి..? ఏయే డాక్యుమెంట్స్ కావాలి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన దేశంలోని పేద మహిళల కోసం ప్రారంభించిన స్కీమ్. ఉజ్వల గ్యాస్ లబ్ధిదారులకు ప్రతి ఏడాది 2 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

Also Read: Realme Gt Neo 6: 240W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో పవర్‌ ఫుల్‌ Realme మోడల్‌ రాబోతోంది..ఫీచర్స్‌ ఇవే!

ఏడాదికి రెండు సిలిండర్లు అందజేస్తామని.. దీపావిళి పర్వదినం సందర్భంగా మొదటి సిలిండర్‌ను.. హోలీ పండుగ సందర్భంగా రెండో సిలిండర్‌ను అందజేస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఫ్రీగా గ్యాస్ సిలిండర్ కావాలంటే ముందుకు ఏజెన్సీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం ఆ డబ్బును మీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. 

పీఎం ఉజ్వల యోజన 2.0 పథకానికి అర్హతలు ఇవే..

==> ఉచిత సిలిండర్ కోసం దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి 
==> దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి
==> కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
 
ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి..
==> ఆధార్ కార్డు
==> రేషన్ కార్డు
==> పాస్‌పోర్ట్ సైజు ఫోటో
==> మొబైల్ నంబర్
==> బ్యాంక్ అకౌంట్

ఎలా అప్లై చేసుకోవాలి

==> ముందుగా అధికారిక www.pmuy.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
==> “ఉజ్వల యోజన 2.0 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
==> మీ గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి. మొబైల్ నంబర్, ఓటీపీ సహాయంతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
==> మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ నంబర్‌ను కరెక్ట్‌గా ఎంటర్ చేయండి.
==> దరఖాస్తును సబ్మిట్ చేసి.. ప్రింట్‌ను డౌన్‌లోడ్ చేయండి.

గమనిక: ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలో తెలియకపోతే.. వెంటనే సమీపంలోని ఏదైనా గ్యాస్ డీలర్‌కు వెళ్లి అప్లై చేసుకోండి.

Also Read: Cobra Snake: ధైర్య సాహసాలతో మనుమరాలిని కాపాడిన నాన్నమ్మ నాగుపాముకు బలి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More