Home> బిజినెస్
Advertisement

Hindenburg Report: హిండెన్‌బర్గ్ హిట్ లిస్టులో మరో పెద్ద కంపెనీ, త్వరలో నివేదిక, భారతీయ కంపెనీల్లో ఆందోళన

Hindenburg Report: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇప్పుడు మరో బాంబు పేల్చేందుకు సిద్ధంగా ఉంది. ఒకే ఒక్క నివేదికతో అదానీ గ్రూప్‌ని పతనావస్థకు చేర్చిన నివేదిక ఇప్పుడు మరో కంపెనీని టార్గెట్ చేసింది. హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన ఆ కంపెనీ ఏదనే విషయంలో ఇప్పుడు చర్చ సాగుతోంది.

Hindenburg Report: హిండెన్‌బర్గ్ హిట్ లిస్టులో మరో పెద్ద కంపెనీ, త్వరలో నివేదిక, భారతీయ కంపెనీల్లో ఆందోళన

Hindenburg Report: ప్రపంచవ్యాప్తంగా హిండెన్‌బర్గ్ కంపెనీ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న వ్యక్తిని ఏకంగా 24వ స్థానంలోకి నెట్టేసింది. అదానీ సంపదను క్షణాల్లో రోజుల వ్యవధిలో ఆవిరి చేసేసింది. అలాంటి నివేదిక మరో కంపెనీని టార్గెట్ చేస్తోందంటే పరిస్థితి ఎలా ఉంటుంది..

ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమౌతోంది. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని, ఎక్కౌంటింగ్ ఫ్రాడ్, మనీ లాండరింగ్, కృత్రిమంగా షేర్ల ధరలు పెంచడం చేసిందంటూ రెండేళ్లపాటు అధ్యయనం చేసి జనవరి 24వ తేదీన వెలువరించిన నివేదిక ప్రపంచాన్ని కుదిపేసింది. ముఖ్యంగా ఇండియాలో కలకలం రేపింది. ఆ రిపోర్ట్ ప్రభావంతో అప్పటి వరకూ ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ పడిపోతూ ఓ దశలో 29వ స్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు తిరిగి 24వ స్థానంలో నిలిచారు. రోజుల వ్యవధిలో 120 బిలియన్ డాలర్ల అదానీ సంపద ఆవిరైపోయింది. సెప్టెంబర్ 2022లో 150 బిలియన్ డాలర్లున్న అదానీ సంపద 53 బిలియన్ డాలర్లకు చేరింది. 

ఇప్పుడు ఇదే హిండెన్‌బర్గ్ సంస్థ మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైంది. త్వరలో మరో పెద్ద సంస్థను లక్ష్యంగా చేసుకుని నివేదిక విడుదల చేస్తున్నట్టు హిండెన్‌బర్గ్ సంస్థ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది ఏ కంపెనీ అనేది వెల్లడించకపోవడంతో అందరిలో ఆందోళన పెరుగుతోంది. యూఎస్‌లోని బ్యాంకుకు సంబంధించినదా లేదా మరో ఇండియన్ కంపెనీనా అనేది ఆసక్తి ఎక్కువైంది. హిండెన్‌బర్గ్ టార్గెట్ చేస్తున్న కంపెనీ ఇండియన్ కంపెనీ కాదు కదా అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ఈసారి చైనా కంపెనీని టార్గెట్ చేయాలని మరో నెటిజన్ కామెంట్ చేయడం విశేషం. 

హిండెన్‌బర్గ్ త్వరలో వెలువరించనున్న నివేదిక ఏ కంపెనీదా అనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. హిండెన్‌బర్గ్ ప్రభావం ఎలా ఉంటుందనేది గతంలో ఇతర దేశాల్లోని కంపెనీలకు తెలిసినా..భారతదేశానికి పెద్దగా తెలియదు. అదానీ కంపెనీ వ్యవహారంతో అందరికీ హిండెన్‌బర్గ్ పేరు ప్రాచుర్యమైపోయింది. ఒక్క నివేదికతో మొత్తం ఆర్ధిక పరిస్థితే తలకిందులైపోయింది. ఇప్పుడు పార్లమెంట్‌లో ఇదే విషయం రచ్చకు దారి తీస్తోంది. మరి హిండెన్‌బర్గ్ టార్గెట్ చేస్తున్న కంపెనీ ఏదనేది తెలియాల్సి ఉంది.

Also read: Financial Work: మార్చి 31వ తేదీలోపు ఈ పనులు కంప్లీట్ చేయండి.. లేకుంటే ఇబ్బందులు తప్పవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More