Home> బిజినెస్
Advertisement

Todays Gold Rate: బంగారం ధర ఆకాశానికి..తులం బంగారం 55 వేలకు చేరువలో

Todays Gold Rate: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం బంగారం, క్రూడ్ ఆయిల్ ధరలపై విపరీతంగా పడుతోంది. అటు బ్యారెల్ ధర, ఇటు తులం బంగారం ధర రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి.
 

Todays Gold Rate: బంగారం ధర ఆకాశానికి..తులం బంగారం 55 వేలకు చేరువలో

Todays Gold Rate: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం బంగారం, క్రూడ్ ఆయిల్ ధరలపై విపరీతంగా పడుతోంది. అటు బ్యారెల్ ధర, ఇటు తులం బంగారం ధర రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ ఇతరత్రా కారణాలతో బంగారం ధరలు రోజూ మారుతుంటాయి. ఇప్పుడు తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపధ్యంలో బంగారం ధర భారీగా పెరిగిపోయింది. పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర ఏకంగా 50 వేలకు చేరుతోంది. 24 క్యారెట్ల బంగారం 55 వేల దాటేసింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 4 వందలు కాగా,  24 క్యారెట్ల బంగారం 54 వేల 760కు చేరుకుంది. ఇక ముంబైలో కూడా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 4 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 890 రూపాయలుగా ఉంది. అటు చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 55 వేలకు చేరువలో ఉంది. చెన్నైలో  54 వేల 760 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో అప్పుడే 50 వేల 2 వందలకు చేరుకుంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 4 వందలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 53 వేల 890 రూపాయలుగా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

Also read: UPI Payments: ఇంటర్నెట్​ లేకున్నా యూపీఐ పేమెంట్స్​.. ఫీచర్​ ఫోన్​తో కూడా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More