Home> బిజినెస్
Advertisement

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే!

Gold Price stable on 19th December 2022 in Hyderabad and India: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,490గా ఉంది. 
 

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే!

Gold Price stable and on Silver Price hiked on 19th December 2022: సాధారణంగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతాయి. ఇంకొన్నిసార్లు మాత్రం స్థిరంగా ఉంటాయి. ఈ పసిడి ధరలు ప్రపంచ, దేశంలోని వివిధ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అయితే దేశంలోని ప్రజలు బంగారం, వెండికి దాకా ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి ధరల్లో ఎంత మార్పు ఉన్నా.. కొనుగోళ్లు మాత్రం భారీగానే ఉంటాయి. ప్రతిరోజు ఉదయం బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.

గత కొన్ని రోజలుగా పసిడి ధరలు వరుసగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. పెరిగిన బంగారం ధరలు ఇటీవలి రోజుల్లో హెచ్చుతగ్గులు అవుతున్నాయి. సోమవారం (డిసెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,950లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,490లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. 

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,640గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,4900గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,560గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,160 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,000గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,540గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,490గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,490గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,950.. 24 క్యారెట్ల ధర రూ. 54,490గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,490 వద్ద కొనసాగుతోంది. 

బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. సోమవారం (డిసెంబర్ 19) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 69,300లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 300 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 69,300లుగా ఉండగా.. చెన్నైలో రూ. 73,000లుగా ఉంది. బెంగళూరులో రూ. 73,000గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 73,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 73,000ల వద్ద కొనసాగుతోంది. 

Also Read: Saturday Remedies: శనివారం నాడు ఈ 5 చిన్న పరిహారాలు చేస్తే.. శని దేవుడు మిమ్మల్ని ధనవంతులను చేస్తాడు!

Also Read: Sun Transit 2022: నేడే త్రిగ్రాహి యోగం.. ఈ 5 రాశుల వారు అదృష్టవంతులు! లెక్కలేనంత డబ్బు మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Read More