Home> బిజినెస్
Advertisement

Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా

Todays Gold Rate: పసిడి ధరలు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఓ వైపు ధరలు పెరుగుతున్నా..డిమాండ్, కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు.
 

Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా

Todays Gold Rate: పసిడి ధరలు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఓ వైపు ధరలు పెరుగుతున్నా..డిమాండ్, కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఎప్పటికప్పుడు మారుతుంటుంది. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, డాలర్ విలువ, బులియన్ మార్కెట్‌లో బంగారం డిమాండ్ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు బంగారం ధరలు మారుతుంటాయి. దేశంలో కూడా ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Price) 10 గ్రాముల ధర 47 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51 వేల 440 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 370 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 450 రూపాయలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 80 రూపాయలుంటే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 80 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 2 వందలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 9 వందలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుగా ఉంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల వంద రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల వంద రూపాయలుగా ఉంది. అటు విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

Also read: Maruti Suzuki Price Hike: మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు- అదే బాటలో మరిన్ని కంపెనీలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More