Home> బిజినెస్
Advertisement

Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బులియన్ మార్కెట్‌లో బంగారం ధర మరోసారి స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
 

Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బులియన్ మార్కెట్‌లో బంగారం ధర మరోసారి స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. గత కొద్దిరోజులుగే ఇదే పరిస్థితి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర..ఇవాళ అంతే స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేటు, డాలర్ విలువ, వివిధ దేశాలు లేదా ప్రాంతాల మధ్య భౌగోళిక పరిస్థితులు వంటివి బంగారం ( Gold Price), సిల్వర్ ధరలపై ఎప్పటికప్పుడు ప్రభావం చూపుతుంటాయి. అందుకే బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల (Delhi Gold Rate) బంగారం పది గ్రాముల ధర 47వేల 6 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 9 వందల రూపాయలుగా ఉంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 240 రూపాయలు కాగా, అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 240గా ఉంది. ఇక చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 550 రూపాయలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 690 రూపాయలుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 4 వందలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 100 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 450 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 590 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 450 రూపాయలుండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 590 రూపాయలుగా ఉంది .

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు బెంగళూరు, కేరళతో సమానంగా ఉన్నాయి.హైదరాబాద్‌లో ( Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 450 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 590 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 450 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 590 రూపాయలుగా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా బంగారం ధర ఇదే కొనసాగుతోంది.

Also read: Edible Oils Price: గుడ్‌న్యూస్, మరోసారి తగ్గిన వంటనూనె ధరలు, ఎంఆర్‌పిపై 15 శాతం వరకూ తగ్గింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More