Home> బిజినెస్
Advertisement

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్... మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే..

Gold Price Today: కొనుగోలుదారులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. ఇవాళ మరోసారి గోల్డ్ రేట్స్ పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి. 
 

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్... మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే..

Gold Price Today: బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. ఇవాళ కూడా పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. ఇవాళ తులం బంగారంపై రూ.100 మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,100కు లభిస్తోంది. అదేవిధంగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,280గా ఉంది. వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. కిలో వెండిపై రూ.200 మేర పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ. 58,300 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.63,500గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. 

తెలుగు రాష్ట్రాల్లో..
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద కొనసాగుతోంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
>> ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్లు రూ.51,530 ఉంది.
>> ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్లు రూ.51,280 పలుకుతోంది.
>>  కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,280 వద్ద ఉంది.
>> బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,430 ఉంది.
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,280 వద్ద ఉంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,760 వద్ద ఉంది.

Also read: Today Gold Rate: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More