Home> బిజినెస్
Advertisement

Adani Group: ఆగని పతనం, నెలరోజుల్లోనే 11 లక్షల కోట్ల అదానీ సంపద ఆవిరి

Adani Group: అదానీ కంపెనీ షేర్ల పతనం ఇంకా కొనసాగుతోంది. హిండెన్‌బర్గ్ నివేదిక సృష్చించిన విలయం నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. నివేదిక వెలువడిన నెలరోజుల్లోనే 11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఆ వివరాలు మీ కోసం..
 

Adani Group: ఆగని పతనం, నెలరోజుల్లోనే 11 లక్షల కోట్ల అదానీ సంపద ఆవిరి

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రభావంతో ప్రపంచ కుబేరులో జాబితాలో 26వ స్థానానికి పడిపోయారు గౌతమ్ అదానీ. రిపోర్ట్ వెలువడి ఇంకా నెలరోజులు పూర్తి కాకుండానే అదానీ గ్రూప్ స్టాక్ విలువ సగానికి పైగా పడిపోయింది. షేర్ల పతనం ఇంకా కొనసాగుతోంది. 

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరి 25వ తేదీన దిగ్గజ అదానీ గ్రూప్‌పై నివేదిక వెలువరించింది. కంపెనీపై ఎక్కౌంటింగ్ ఫ్రాడ్, కృత్రిమంగా షేర్ విలువలు పెంచడం, అవినీతి, మనీ లాండరింగ్ ఆరోపణలు చేసింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడేనాటికి ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ 3 వ స్థానంలో ఉన్నారు. సంపదనలో ముకేష్ అంబానీని ఎప్పుడో దాటేశారు. ఆ తరువాత అదానీ షేర్ల పతనం ప్రారంభమైంది. మార్కెట్ ఒక్కసారిగా షేక్ అయింది. కేవలం నెలరోజులు ఇంకా పూర్తి కాకుండానే గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 3 నుంచి 26వ స్థానానికి పడిపోయారు. ఇప్పుడాయ కంపెనీ సంపద విలువ కేవలం 47.4  బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే 28 రోజుల వ్యవధిలో ఏకంగా 11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అదానీ కంపెనీ షేర్లు ఈ మేరకు నష్టపోయాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్ విలువ 57 శాతం పడిపోయింది. 

హిండెన్‌బర్గ్ సృష్టించిన విధ్వంసానికి ముందు అంటే జనవరి 25వ తేదీన అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 19.2 లక్షల కోట్లుగా ఉంది. రోజురోజుకీ షేర్ విలువ దారుణంగా పడిపోతుండటంతో..ఇప్పుడది 8.2 లక్షల కోట్లకు తగ్గిపోయింది. ఇవాళ కూడా అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీ షేర్లు 5 శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇక అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్లు 52 వారాల గరిష్టం నుంచి 61 శాతం పడిపోయాయి. అదానీ పోర్ట్స్ కూడా గరిష్ట స్థాయి నుంచి 40 శాతం పడిపోయింది. 

సత్ఫలితాలనివ్వని దిద్దుబాటు చర్యలు

ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన గౌతమ్ అదానీ చేస్తున్న దిద్దుబాటు చర్యలు పెద్దగా ఫలితాలనివ్వడం లేదు.  కమ్ బ్యాక్ ప్లాన్‌లో భాగంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ బకాయి 1500 కోట్లను చెల్లించామని..మార్చ్‌లో మరో 1000 కోట్లు చెల్లిస్తామని అదానీ పోర్ట్స్ ప్రకటించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో చెల్లించాల్సిన 5000 కోట్ల రుణాన్ని సైతం ముందుగానే చెల్లించామని..మార్చ్ నెలలో గ్రూప్ 500 మిలియన్ డాలర్ల బ్రిడ్జి లోన్ కూడా చెల్లించేస్తామని కంపెనీ తెలిపింది. 

భారీగా రుణాలు తీసుకుని, ఆ పునాదులపై సామ్రాజ్యాన్ని విస్తరించిన అదానీ గ్రూప్ ఇప్పుడు దృష్టి మార్చింది. నగదు పొదుపు, రుణాలు చెల్లింపులు, తాకట్టు షేర్లు విడిపించడంపై ఫోకస్ పెట్టింది. ఇన్ని చేస్తున్నా ఇంకా అదానీ షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. 

Also read: EPFO New Guidelines: అధిక పెన్షన్ కోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఈపీఎఫ్ఓ, ఇలా అప్లై చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More