Home> బిజినెస్
Advertisement

Flipkart Big Diwali Sale: అలాంటి ఆఫర్‌ మళ్లీమళ్లీ రాదు.. శామ్‌సంగ్ ఫ్లిప్, ఫోల్డ్ ధర ఎంతో తెలిస్తే షాకే!

Samsung Galaxy Z Flip 3,  Z Fold 3 Smartphones prices to reduce in Flipkart Big Diwali Sale. శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై 'బిగ్ దీపావళి సేల్'లో అద్భుతమైన ఆఫర్‌లు అందుబాటులో ఉండనున్నాయి. 
 

Flipkart Big Diwali Sale: అలాంటి ఆఫర్‌ మళ్లీమళ్లీ రాదు.. శామ్‌సంగ్ ఫ్లిప్, ఫోల్డ్ ధర ఎంతో తెలిస్తే షాకే!

Samsung Galaxy Z Flip 3,  Z Fold 3 Smartphones prices to reduce in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే 'బిగ్ బిలియన్ సేల్' పూర్తికాగా.. ప్రస్తుతం 'బిగ్ దసరా సేల్' నడుస్తోంది. ఇప్పుడు ప్రతి వస్తువుపై అద్భుతమైన ఆఫర్‌లు ఉన్నాయి. 'బిగ్ దీపావళి సేల్' కూడా త్వరలోనే ఆరంభం కానుంది. ఆ సమయంలో కూడా అద్భుతమైన ఆఫర్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా ప్రముఖ మొబైల్ సంస్థ 'శామ్‌సంగ్' మంచి ఆఫర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. గత సంవత్సరం విడుదలైన ఫ్లిప్ ఫోన్‌, మడత స్క్రీన్‌ ఫోన్‌లపై భారీగా ధరలను తగ్గించనుంది. 

శామ్‌సంగ్ Z ఫ్లిప్ 3 ధర 'బిగ్ దసరా సేల్'లో భారీగా తగ్గనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ధర రూ. 60,000 లోపు ఉంటుందని సమాచారం. ఇది గెలాక్సీ Z ఫ్లిప్ 3ని కొనుగోలు చేయగల చౌకైన ధర. మరోవైపు శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3 ధర రూ. 1 లక్ష లోపు ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు లాంచ్ ధర రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ ఉంది. 

శామ్‌సంగ్ Z ఫ్లిప్ 3 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫోల్డబుల్ 6.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. ఫ్లిప్ 3 ఫోన్ 3300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 15W వైర్డు ఛార్జింగ్ మాత్రమే ఉంది. 

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3లో 7.6 అంగుళాల ప్రైమరీ క్యూఎక్స్‌జీఏ ప్లస్ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ ఇన్‌ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5ఎన్ఎం ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అందించారు. ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా.. ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్‌గా ఉంది. 

Also Read: నటిని షోరూంలో లాక్ చేసిన సిబ్బంది... చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన.. కేరళలో షాకింగ్

Also Read: Snake Viral Video: ఎప్పుడైనా మీరు స్మశానంలో పాములను చూశారా..అయితే ఒక్కసారి ఈ వీడియోను చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Read More