Home> బిజినెస్
Advertisement

Flipkart vs Amazon Sales: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్ సేల్స్ ప్రారంభం, ఊహించని ఆఫర్లు మీ కోసం

Flipkart vs Amazon Summer Sales: వేసవి సీజన్ దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు మరోసారి ఆఫర్ సేల్స్ ప్రారంభించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో వివిధ రకాల ఉత్పత్తుల్ని అందుబాటులో ఉంచాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ సేల్స్ ప్రారంభ తేదీ, ఆఫర్లు ఇలా ఉన్నాయి.

Flipkart vs Amazon Sales: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్ సేల్స్ ప్రారంభం, ఊహించని ఆఫర్లు మీ కోసం

Flipkart vs Amazon Summer Sales: సమ్మర్ వెకేషన్స్ నడుస్తున్నాయి. సమ్మర్ టూరింగ్ ప్రారంభమైంది. అదే సమయంలో సమ్మర్ షాపింగ్ కోసం ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆఫర్ సేల్స్ ప్రారంభించాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ డేస్ సేల్ ప్రారంభిస్తే..ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలెట్టింది. ఇవాళ్టి నుంచి మే 10 వరకూ ఈ ప్రత్యేక సేల్ నడుస్తుంది.

ప్రముఖ ఈ కామర్స్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఇవాళ మే 4 నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ డేస్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఇందులో వివిధ కంపెనీల మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు సహా చాలా ఉత్పత్తులు ఆఫర్లతో అందుతున్నాయి. కంపెనీ ఇచ్చే ఆఫర్లకు తోడుగా వివిధ బ్యాంకులు క్యాష్ బ్యాక్ లేదా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ డేస్ సేల్ ఇవాళ అంటే మే 4 మద్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. మే 8 వరకూ ఉంటుంది. కేవలం ఐదురోజులు మాత్రమే ఉండే ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై ముఖ్యంగా మొబైల్ ఫోన్స్‌పై ఆకర్ణణీయమైన డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. ఇక ఫ్లిప్‌కార్ట్ సంస్థ బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో సమ్మర్ సేల్స్ ఇవాళ మద్యాహ్నం ప్రారంభించింది. ఈ సేల్ మే 10 వరకూ వారం రోజులు అందుబాటులో ఉంటుంది. ప్లస్ సభ్యులకు నిన్నటి నుంచే సేల్స్ ప్రారంభమయ్యాయి.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ డేస్ సేల్‌లో భాగంగా కొటాక్ మహీంద్ర బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఆఫర్ కూడా ఉత్పత్తిని బట్టి మారుతుంటుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ఆఫర్ నడుస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. పేటీఎం వ్యాలెట్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ డేస్ సేల్‌లో వన్‌ప్లస్ 10 ఆర్ 5జీ, ఐక్యూ జెడ్ 5, ఐక్యూ నియో6 -5జి, ఐక్యు నియో7-5జి, రెడ్‌మి కే50ఐ 5జి, శాంసంగ్ గెలాక్సి ఎం33 5జితో పాటు ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. అదేవిధంగా స్మార్ట్‌వాచ్‌లపై 70 శాతం, హోమ్ అప్లయన్సెస్‌పై 60 శాతం, స్మార్ట్‌టీవీలపై 50 శాతం, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం ఆఫర్లు ఉన్నాయి.

ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో రియల్‌మి 10 ప్రో 5జి, గూగుల్ పిక్సెల్ 6ఏ, నధింగ్ ఫోన్ 1, రెడ్‌మి నోట్ 12 ప్రో 5జి, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈతో పాటు ఐఫోన్ 13 సిరీస్‌పై మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ఇక ల్యాప్‌టాప్‌లపై 40 శాతం, స్మార్ట్‌టీవీలపై 50 శాతం, స్మార్ట్‌వాచ్‌లపై 80 శాతం, రిఫ్రిజిరేటర్లు, ఏసీలపై 60 శాతం వరకూ ఆఫర్లు ఉన్నాయి.

Also read: Adani-Hindenburg Issue: అదానీ-హిండెన్‌బర్గ్ అంశంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు, సెబీకు వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More