Home> బిజినెస్
Advertisement

Flipkart Smart Phone Offer: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెల్లువ... రూ.12వేలు విలువ చేసే రియల్‌మీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.749కే...

Flipkart Mobile Phone Offers: కస్టమర్స్ కోసం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి 'బిగ్ బచత్ ధమాల్ సేల్'ను ప్రకటించింది. జూన్ 3 నుంచి జూన్ 5 వరకు ఈ సేల్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.

Flipkart Smart Phone Offer: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెల్లువ... రూ.12వేలు విలువ చేసే రియల్‌మీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.749కే...

Flipkart Smart Phone Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్ బచత్ ధమాల్ సేల్' కింద భారీ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందిస్తోంది. స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులపై ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది.ఈ ఆఫర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లయితే సగం కన్నా తక్కువ ధరకే మీకు కావాల్సిన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవచ్చు. బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో భాగంగా ప్రస్తుతం రియల్‌మీ సీ31 (డార్క్ గ్రీన్ 64 జీబీ) స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్‌తో రూ.12 వేలు విలువ చేసే ఈ ఫోన్‌ను అతిచౌకగా కేవలం రూ.749కే పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం... 

ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ :

రియల్‌మీ సీ31 (డార్క్ గ్రీన్ 64 జీబీ) స్మార్ట్ ఫోన్‌ సాధారణ ధర రూ.11,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 16 శాతం తగ్గింపుతో కేవలం రూ.9999కే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ కొనుగోలుకు మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉపయోగించినట్లయితే 5 శాతం క్యాష్ బ్యాక్ పొందుతారు. అంటే.. మరో రూ.500 వరకు తగ్గింపు పొందినట్లే. దానికి తోడు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై మరో రూ.2 వేలు వరకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ రెండు డిస్కౌంట్స్ వర్తించినట్లయితే... రూ.9999 విలువ చేసే ఈ రియల్‌మీ సీ31 ఫోన్‌ని కేవలం రూ.7499కే కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.749కే :

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ సీ31 (డార్క్ గ్రీన్ 64 జీబీ) స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్‌ని మార్చుకున్నట్లయితే ఈ ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద మొబైల్ కండిషన్‌ని బట్టి రూ.9250 వరకు తగ్గింపు పొందుతారు. ఒకవేళ పూర్తి ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తించినట్లయితే... రూ.9999కి అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ని అత్యంత చౌకగా.. కేవలం రూ.749కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌కి కండిషన్స్ వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఈ ఆఫర్ బిగ్ బచత్ ధమాల్ సేల్ ఉన్నంతవరకే అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ రేపటి (జూన్ 5)తో ముగియనుంది. 

Also Read: Sharmila Comments: తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు..టీఆర్ఎస్‌ సర్కార్‌పై షర్మిల ఫైర్..!

Also Read : Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్... సీబీఐ విచారణకు బండి సంజయ్ డిమాండ్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Read More